చైనాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. షాంగ్సీ ప్రావిన్స్‌లోని ఓ వంతెన కుప్పకూలింది. దీంతో ఆ వంతెనపై ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందడం కలకలం రేపింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. చైనాలో ఇటీవల కురుస్తున్న ఆకస్మిక వర్షాలు, వరదల కారణంగా షాంగ్లూ నగరంలోని ఓ హైవేపై ఉన్న వంతెన శుక్రవారం కూలిపోయింది. ఆ వంతెన పాక్షికంగా కూలడంతో దానిపై ప్రయాణిస్తున్న 11 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
Also Read: మరో గల్ఫ్ బాధితుడికి అండగా లోకేష్.. రప్పించే బాధ్యత తదేనంటూ!
మరికొంతమంది తీవ్రంగా గాయలపాలయ్యారు. అలాగే వంతెన కింద ఉన్న నదిలో గల్లంతైన వారి ఆచూకి కోసం ఏకంగా 736 మంది సహాయక సిబ్బంది, 76 వాహనాలు, 18 పడవలు, 31 డ్రోన్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా నదిలో పడ్డ ఐదు వాహనాలను రెస్క్యూ బృందాలు స్వాధీనం చేసుకున్నాయని పేర్కొన్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
Also Read: బోటులో ఘోర అగ్ని ప్రమాదం.. 40 మంది దుర్మరణం!