Houthis : హౌతీలపై భూతల దాడులకు పిలుపునిచ్చిన యెమెన్.. ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు యెమెన్ పిలుపునిస్తోంది. వారిపై భూతల దాడులు చేసేందుకు ఇతర దేశాలు సహాకారం తమ సైన్యానికి కావాలని యెమెన్ డిప్యూటీ ప్రెసిడెంట్ కౌన్సిల్ లీడర్ ఐదారుస్ అల్-జుబైది అన్నారు. By B Aravind 19 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Yemen : ఎర్ర సముద్రం(Red Sea) లో నౌకలపై హౌతీ(Houthi) తిరుగుబాటుల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వారిపై తిరుగుబాటు చేసేందుకు యెమెన్ పిలుపునిస్తోంది. హౌతీలపై భూతల దాడులు చేసేందుకు ఇతర దేశాలు సహాకారం తమ సైన్యానికి కావాలని యెమెన్(Yemen) డిప్యూటీ ప్రెసిడెంట్ కౌన్సిల్ లీడర్ ఐదారుస్ అల్-జుబైది అన్నారు. అయితే ఎడెన్ పోర్టు ప్రాంతంలో అమెరికా నౌకపై క్షిపణులతో దాడి చేశామని హౌతీ తిరుగుబాటుదారులు శుక్రవారం ప్రకటన చేశారు. విదేశీ సాయం కావాలి ఈ దాడిపై స్పందించిన అమెరికా(America).. తమకు ఎలాంటి నష్టం కలగలేదని.. ప్రాణ నష్టం జరగలేదని చెప్పింది. ఈ నేపథ్యంలో హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు.. అమెరికా, యూకే వైమానిక విమానాలతో పాటు భుతల యుద్ధ చేసేందుకు విదేశీ సాయం అవసరం అవుతుందని ఐదారుస్ అన్నారు. అలాగే ఎర్రసముద్రంలో అంతర్జాతీయ నావిగేషన్(International Navigation) ను సురక్షితంగా ఉంచేందుకు అంతర్జాతీయ, ప్రాంతీయ కూటమి అవసరమవుతుందని తెలిపారు. Also Read : Akasa Air : బోయింగ్ విమానాలకు భారీగా ఆర్డర్ చేసిన అకాసా ఎయిర్ లైన్స్ దాడులు కొనసాగిస్తాం మరోవైపు హౌతీ రెబెల్స్ చేస్తున్న దాడులపై ప్రతీకార చర్యలు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇప్పటివరకు అమెరికా, బ్రిటిష్ సైన్యాలు చేసిన దాడులు హౌతీలను ఆపలేకపోయాయని తెలిపారు. మరోవైపు హౌతీ రెబెల్స్ నాయకుడు అబ్దెల్ మాలెక్ అల్-హౌతీ.. ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ మీదుగా ప్రయాణించే నౌకలపై తమ దాడులు జరుగుతూనే ఉంటాయని గురువారం ఓ వీడియో సందేశంలో ప్రకటన చేశాడు. ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో చిక్కుకుపోయిన హమాస్, పాలస్తినీయులకు మద్దతు ఇచ్చేందుకే తాము ఈ దాడులు చేస్తున్నట్లు తెలిపాడు. హౌతీలను ఆపేందుకు ప్రయత్నాలు అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్(Israel - Hamas) మధ్య యుద్ధం దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేలాదిమంది ఈ దాడుల్లో మరణించారు. ఈ తరుణంలో ఇజ్రాయెల్ గాజాపై చేసిన దాడులకు వ్యతిరేకంగా హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేయడం మొదలుపెట్టారు. కేవలం ఇజ్రాయెల్ వెళ్లే నౌకలపైనే కాకుండా ఇతర దేశాల నౌకలపై కూడా హౌతీలు దాడులు చేయడం సంచలనం రేపింది. దీంతో అమెరికాతో సహా.. పలు దేశాలు ఏకమై ఎర్రసముద్రంలో హౌతీలు చేస్తున్న దాడులను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. Also Read : Delimitation : NHPC నుంచి తన వాటాను అమ్ముతున్న ప్రభుత్వం.. వివరాలివే.. #houthis #israel-hamas-war #yemen #red-sea #telugu-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి