MP Balashowry: జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి

ఎంపీ బాలశౌరి ఈ రోజు జనసేనలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన నుంచి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

New Update
MP Balashowry: జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి

MP Balashowry Vallabbhaneni: మరికొన్ని నెలల్లో లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) జరగనున్న వేళ సీఎం జగన్ కు (CM Jagan) షాక్ తగిలింది. ఎంపీ బాలశౌరి (MP Balashowry) ఈ రోజు జనసేనలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు పొత్తులో భాగంగా జనసేన నుంచి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ALSO READ: నన్ను చంపాలని చూశారు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

నేను జనసేన కార్యకర్తనే..

ఇకపై తాను కూడా జనసేన కార్యకర్తనే అని అన్నారు ఎంపీ బాలశౌరి. రాజకీయ పార్టీ నడపడం చాలా కష్టమని అన్నారు. సినిమాల్లో తీసుకునే రెమ్యునరేషన్ తో పవన్ కళ్యాణ్ పార్టీ నడుపుతున్నారని పేర్కొన్నారు. ఇకపై తన రాజకీయ జీవితం పవన్ కళ్యాణ్ తోనే అని అన్నారు. జనసేన పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. పవన్ కు అందరం అండగా ఉండాలని అన్నారు. తాను కూడా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు.. సీఎం జగన్ ను ఓడించేందుకు పని చేస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకు ఏ పదవి ఇచ్చిన తాను పనిచేస్తానని వెల్లడించారు.

ఇదే పెద్ద అబద్దం..

సీఎం జగన్ తాను ఇప్పటి వరకు అసలు అబద్దాలు ఆడలేదు అని అనడమే పెద్ద అబద్దం అని ఎంపీ బాలశౌరి అన్నారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి ఆంధ్ర ప్రదేశ్ కు రాజధానిగా ఉండలని చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ హయాంలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి దూరంగా ఉందని ఆరోపించారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు పైసల్ కూడా రాలేదని అన్నారు. సీఎం జగన్ కు అభివృద్ధి చాలా దూరం ఉందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో సీఎం జగన్ ఓటమి చెందడం ఖాయమని అన్నారు. వచ్చేది టీడీపీ, జనసేన పార్టీలే అని ధీమా వ్యక్తం చేశారు.

ALSO READరేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

DO WATCH: 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు