Devineni Uma: నన్ను చంపాలని చూశారు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడులు చేశారు.. చంపాలని చూశారని.. ఈరోజు బ్రతికి ఉన్నానంటే దానికి కారణం తమ నాయకుడు చంద్రబాబు అండ.. కార్యకర్తల బలమే అని పేర్కొన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. By V.J Reddy 04 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Devineni Uma Maheswara Rao: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009లో పార్టీ మారాలి లేదంటే నియోజకవర్గం వదిలి వెళ్లాలంటూ బెదిరించారని అన్నారు. పసుపుకండువా కప్పుకొని చచ్చిపోతా తప్ప పార్టీ వీడను అని వారికి చెప్పినట్లు తెలిపారు. చంద్రాబాబు (Chandrababu), టీడీపీ (TDP) కార్యకర్తల మాటే తనకు శిరోధార్యం అన్నారు. 25 ఏళ్లుగా పార్టీ నిర్ణయాలను శిరసావహించి ముందుకు నడిచినట్లు పేర్కొన్నారు. ALSO READ: రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2014లో ఆగర్భ శత్రువుల దగ్గరికి పంపించినా పార్టీ కోసం జైలు దగ్గరకు వెళ్లి కలిసినట్లు తెలిపారు. కేశినేని నాని (Kesineni Nani), వసంత కృష్ణ ప్రసాద్, సుజనా చౌదరిలు తలా ఒక పార్టీలో ఉంటూ అవకాశాలను బట్టి పార్టీలు మారుస్తూ ఆస్తులు సంపాదించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ల పనులు చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. మైలవరంలో దోచిన డబ్బులు పెట్టి గెలుస్తామంటే ప్రజలు ఒప్పుకోరని అన్నారు. తనపై దాడులు చేశారు.. చంపాలని చూశారని.. ఈరోజు బ్రతికి ఉన్నానంటే దానికి కారణం తమ నాయకుడు చంద్రబాబు అం.. కార్యకర్తల బలమే అని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత జైలుకైనా వెళ్తా.. లేదా చింతలపూడి కాలువల మీదైనా పడుకుంటా అని అన్నారు. వంద కోట్లు ఇస్తాం అని వస్తున్న రాజకీయ వ్యభిచారులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కైన కేశినేని నాని అనే నమ్మకద్రోహి ఒకడు పార్టీ గుండెలపై తన్ని పోయాడని మండిపడ్డారు. జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో తాను అన్నేరావుపేట నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం గుంటుపల్లిలో జరిగిన 'టౌన్ హాల్ మీటింగ్ విత్ లీడర్' కార్యక్రమంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడులు చేశారు.. చంపాలని చూశారని.. ఈరోజు బ్రతికి ఉన్నానంటే దానికి కారణం తమ నాయకుడు చంద్రబాబు అం.. కార్యకర్తల బలమే అని పేర్కొన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ALSO READ: కేసీఆర్ దుర్మార్గుడు… చేసిన పాపాలకు లెక్కలు లేవు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు DO WATCH: #chandrababu #tdp #janasena #ycp #devineni-uma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి