AP Assembly: రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. By V.J Reddy 04 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి AP Assembly: రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో పూర్తి బడ్జెట్ఓ కాకుండా.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది ఏపీ సర్కార్. కొన్ని సమస్యలు అసెంబ్లీలో చర్చ కోసం పది రోజులు అసెంబ్లీ జరపాలని టీడీపీ అంటుంది. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ప్రస్తుతం మార్పులు చేర్పులు చేసింది వైసీపీ. ALSO READ: కేసీఆర్ దుర్మార్గుడు… చేసిన పాపాలకు లెక్కలు లేవు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు పలు కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం.. * మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్‌సిగ్నల్ * 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం * వైఎస్సార్ చేయూత 4వ విడతకు ఆమోదం * ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదల * ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం * ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ * ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఆమోదం * ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం * ఎస్ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం * యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు * అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం * నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం * శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం * ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం * ఆ మేరకు చట్టంలో సవరణకు కేబినెట్ ఆమోదం ALSO READ: ఖమ్మంలో నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. సీపీ సీరియస్ DO WATCH: #mega-dsc #tdp #ycp #ap-assembly #cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి