AP Politics : గాజువాక, మంగళగిరిలో బీసీ ఇన్‌ఛార్జ్ లను నియమించిన వైసీపీ

పవన్ కళ్యాణ్, లోకేష్ పై బిసీ అస్త్రాలను ప్రయోగిస్తోంది వైసీపీ. గాజువాకలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వరికూటి రామచంద్రరావును..మంగళగిరి లో పద్మశాలీ వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్‌లుగా నియమించారు.

AP Politics : గాజువాక, మంగళగిరిలో బీసీ ఇన్‌ఛార్జ్ లను నియమించిన వైసీపీ
New Update

YCP Appointed BC Incharges In Gajuwaka : గాజువాక, మంగళగిరిలో ఇన్ఛార్జ్ పదవులకు వైపీ నేతలు వరుసగా రాజనామాలు చేశారు. ఇది ఒక రకంగా ఆ పార్టీలో కలకలం రేపింది కూడా. అయితే ఇప్పుడు దాన్నే తమ ప్రధాన అస్త్రంగా చేసుకోనుంది వైసీపీ. గాజువాక, మంగళగిరి రెండిటిలోనూ బీసీ అభ్యర్ధులను ఇన్‌చార్జ్‌లుగా నియమించనుంది. గాజువాకలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వరికూటి రామచంద్రరావును..మంగళగిరి లో పద్మశాలీ వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్‌లుగా నియమించారు. ఒకవేళ ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ వేరే నియోజకవర్గానికి మారినా..అక్కడ కూడా బిసీ సామాజిక వర్గం నేతనే ప్రకటించాలని అనుకుంటోంది వైసీపీ అధినాయకత్వం.

Also read:టీఎస్పీఎస్ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్.

రానున్న ఎన్నికలకు వైసీపీ అధినేత, సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో స్థానాలను మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమైన స్థానాలను గుర్తించి అందులో సరైన నేతను బరిలోకి దింపేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గాజువాక, మంగళగిరి ఇన్‌ఛార్జ్‌లు రాజీనామా చేయడంతో వీరు వైసీపీ అధినాయకత్వం సూచనలతో రాజీనామాలు చేస్తున్నారా? లేక అసంతృప్తితో రాజీనామాలుకు నేతలు దిగుతున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. జగన్ నిర్ణయం మేరకే వరస రాజీనామాలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా పార్టీలో జరుగుతుంది. కేవలం రెడ్డి సామాజికవర్గం నేతలే రాజీనామా చేయడం కూడా ఈ ప్రచారాన్ని బలపర్చే విధంగా ఉందంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ కు పోటీగా గంజి చిరంజీవిని బరిలోకి దించాలని అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గం ఎక్కువగా ఉండటం, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గంజి చిరంజీవి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడంతో జగన్ ఆయనను పోటీకి దించాలని నిర్ణయించారు. కేవలం పథ్నాలుగు ఓట్ల తేడాతోనే ఆయన ఓటమి పాలయ్యారు. లోకేష్ ను ఢీకొట్టడానికి ఈసారి ఆళ్ల కంటే గంజి చిరంజీవి బెటర్ అని భావించడం, సర్వేల్లోనూ అదే విషయం స్పష్టం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

#ycp-appointed-bc-incharges-in-gajuwaka #gajuwaka #incharges #tdp #andhra-pradesh #janasena #ycp #ap-cm-ys-jagan #mangalagiri
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి