Elon Musk: ఎక్స్‌లో ఉగ్ర మూఠాలకు బ్లూటిక్స్‌ సబ్‌స్క్రిప్షన్..

ఎక్స్‌(ట్విట్టర్‌)లో పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించి.. ఉగ్రమూఠాలకు కూడా బ్లూటిక్ వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ది టెక్‌ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్టు (టీటీపీ) అనే సంస్థ ఈ విషయాలను బయటపెట్టింది. అమెరికాలో నిషేధం ఎదుర్కొంటున్న హెజ్‌బొల్లా వంటి సంస్థలు ఉన్నాయని పేర్కొంది.

New Update
Elon Musk: ఎక్స్‌లో ఉగ్ర మూఠాలకు బ్లూటిక్స్‌ సబ్‌స్క్రిప్షన్..

X Taking Payments From Terrorists: సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్‌ (ట్విట్టర్‌)ను ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కొనుగోలు చేశాక అందులో అనేక మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో అందర్నీ ఎక్కవగా ఆశ్చర్యానికి గురిచేసింది పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌. డబ్బులు చెల్లించేవారికి మాత్రమే ఈ బ్లూటిక్‌ను (Blue Ticks) అందిస్తోంది ఎక్స్‌ సంస్థ. అయితే ఈ పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌లో.. ఉగ్రమూఠాలకు కూడా బ్లూటిక్ వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ది టెక్‌ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్టు (Tech Transparency Project) అనే సంస్థ ఈ విషయాలను బయటపెట్టింది.

Also Read: మర్డర్ లైవ్ వీడియో కోసం బెస్ట్ ఫ్రెండ్ ను చంపిన యువతి.. 99 ఏళ్ల జైలు శిక్ష!

తప్పుడు సమాచారం వెళ్తోంది

అమెరికాలో కార్యకలాపాలు నిర్వహించడంపై ఇప్పటికే నిషేధం ఎదుర్కొంటున్న హెజ్‌బొల్లా (Hezbollah) వంటి సంస్థలు కూడా ఇందులో ఉన్నట్లు పేర్కొంది. నెలకు 8 డాలర్లు చెల్లిస్తే బ్లూటిక్‌ లభిస్తుందన్న విషయం తెలిసిందే. అంతేకాదు దీనివల్ల సుదీర్ఘ పోస్టులు చేయడానికి.. మెరుగైన ప్రమోషన్‌కు కూడా ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది. ట్విట్టర్‌ను (Twitter) ఎలన్‌ మస్క్‌ తీసుకున్నాక.. బ్లూటిక్‌ కోసం డబ్బులు వసూలు చేయడం అనేది అప్పట్లో వివాదస్పదమైంది. ఇలాంటి నిర్ణయం వల్ల తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్తుందని.. పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.

వాటి బ్లూటిక్స్ తొలగించిన ఎక్స్

ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేయకముందు.. బ్లూటిక్‌ అనేది వినియోగదారులకు ఉచింతంగానే ఉండేది. బ్లూటిక్‌ పొందే వ్యక్తుల వివరాలను సంస్థ వెరిఫై చేసేది. అయితే ఈ బ్లూటిక్‌ పొందేవారిలో ఎక్కవగా సెలబ్రిటీలు, ప్రపంచ నేతలు, జర్నలిస్టులు ఉండేవారు. ఆ తర్వాత ఎలాన్‌ మస్క్‌ తీసుకున్న నిర్ణయాల వల్ల కొత్త సమస్యలు ఎదురవ్వడం ప్రారంభమయ్యాయని.. టీటీపీ సంస్థ వెల్లడించింది. మరో విషయం ఏంటంటే ఈ నివేదిక బయటపడిన తర్వాత కొన్ని సంస్థల బ్లూటిక్స్‌ను ఎక్స్‌ తొలగించింది.

ఆ తర్వాత తమ సంస్థ భద్రతా వ్యవస్థ బలంగా ఉందని చెప్పింది. గతంలో అన్సార్‌ అల్లా (హౌతీలు) సంస్థకు ఎక్స్‌లో ఉన్న బ్లూటిక్‌ అదృశ్యమైంది. ఈ అకౌంట్‌కు 23 వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ సంస్థపై అమెరికా, యూకేలో ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి. కానీ ఇంకా చాలావరకు నిషేధిత సంస్థల బ్లూటిక్‌లు కొనసాగుతున్నాయని టీటీపీ ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read: రెండు గంటల్లో 1250 కి.మీ..చైనా వండర్ ట్రైన్

Advertisment
Advertisment
తాజా కథనాలు