Most Expensive Wedding : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి..అంబానీ పిల్లలది మాత్రం కాదు..ఎవరో తెలుస్తే షాక్ అవ్వడం పక్కా.!

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన కూతురు ఇషా వివాహం అంగరంగవైభవంగా చేశారు. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహం మాత్రం కాదట. మరి ఎవరి వివాహం అత్యంతక ఖరీదైనదిగా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదా? అయితే స్టోరీ చదవాల్సిందే.

New Update
Most Expensive Wedding : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి..అంబానీ పిల్లలది మాత్రం  కాదు..ఎవరో తెలుస్తే షాక్ అవ్వడం పక్కా.!

Most Expensive Wedding :  ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన కూతురు ఇషా వివాహం అంగరంగభైవంగా చేశారు. ఈ పెళ్లి అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహం మాత్రం కాదట. మరి ఎవరి వివాహం అత్యంతక ఖరీదైనదిగా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కెద్దాం.

1628-1658 మధ్యకాలంలో ఢిల్లీ కేంద్రంగా పరిపాలించిన షాజహాన్ నేటికీ చరిత్రలో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకునే విధంగా పరిపాలనను అందించారు. సాంస్కృతిక విషయాల్లో మొఘల్ సామ్రాజ్యం తారాస్థాయికి చేరిందంటే ఈయన కాలంలోనే. షాజహాన్ చక్రవర్తికి ఎంతో కుమారులు ఉన్నప్పటికీ అందులో నలుగురి గురించి మాత్రం చరిత్ర ఎక్కువగా చెబుతుంది. వారిలో పెద్ద కుమారులు అయిన దారా షికో, ఔరంగజేబు కథలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ప్రేమ, అనురాగం, ద్వేషం, రాజకీయకుట్రలు, అంతర్గత కుమ్ములాటలు ఇలా ఎన్నో ట్విస్టులు ఈ కథలో ఉంటాయి. చక్రవర్తుల వైభావన్నే కాదు..పతనాన్నీ కూడా ఈ కథ వివరిస్తుంది. దారా షికో తన సోదరుడి చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో కథ విషాదంగా ముగుస్తుంది.

షాజహాన్ కు నలుగురు కుమారులు ఉన్నారు. దారాషికో, షాషుజా, ఔరంగాజేబ్, మురాద్ బక్ష్. షాజహాన్ కు పెద్దకుమారుడు అయిన దారాషికో అంటే ఎంతో ఇష్టం. ఇతరు ముగ్గురు కుమారులను యుద్దానికి పంపించినా...దారాషికోను మాత్రం యుద్ధానికి పంపించకుండా తన వద్దే ఉంచుకునేవాడు. కాలక్రమేణ షాజహాన్ దారాషికోను తన వారసుడిగా, భారతదేశానికి భావి చక్రవర్తిగా ప్రకటించాడు. తన తండ్రి షాజహాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఔరంగజేబుకు సహించలేదు. ఎలాగైనా తన అన్న దారాషికోను అంతం చేసి సింహాసనాన్ని అధిరోహించాలని ప్లాన్ వేశాడు. అనుకున్నట్లుగానే దారాషికోను హత్య చేయిస్తాడు. దాని తర్వాత జరిగిన పరిణామాల గురించి చరిత్రలో చాలా తెలుసుకుందాం.

కానీ ఈ కథలో కొందరికి మాత్రమే తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదే దారాషికో వివాహం. ఇప్పటివరకు మనదేశంలో అంబానీ మాత్రమే తన కూతురు ఇషా వివాహం గొప్పగా చేశారని చెబుతుంటాం. కానీ 400ఏళ్ల క్రితమే షాజహాన్ తన కుమారుడు దారా షికో వివాహానికి ఎంత ఖర్చు చేశాడో తెలుస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఇంత భారీ ఖర్చు చేసి పెళ్లి చేసివారు ఎవరూ లేరు.

మొఘల్ యువరాజు దారాషికో వివాహం:
మొఘల్ సామ్రజ్యానికి యువరాజు అయిన తర్వాత దారాషికో వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించాడు షాజహాన్. ఈ వివాహం మొఘల్ చరిత్రలో ఒక గొప్ప పెళ్లిగా తరాలకు తెలిసేలా చేసింది. దారాషికో పెళ్లికి రూ. 32లక్షలు ఖర్చు చేశారు. అంటే ఇప్పటి కాలంలో వేల కోట్లతో సమానమని చెప్పుకోవచ్చు. అంతేకాదు దారాషికో పెళ్లికి షాజహాన్ పెద్ద కూతురు, దారాషికో సోదరి తన స్వంతగా 16లక్షల రూపాయలను ఖర్చు చేసింది. పెళ్లి కూతురు డ్రెస్సు ఖరీదు రూ. 8లక్షలు.

దీన్ని బట్టే అర్థం అవుతుంది ఈ వివాహం ఎంత గ్రాండ్ జరిపించారనేది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఎనిమిది రోజుల పాటు ఈ వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వివాహానికి ప్రపంచం నలుమూల నుంచి రాజులు తరలివచ్చారు. అతిరథులకు వడ్డించిన వంటకాలు చరిత్రలో నిలిచిపోయాయి. 400ఏల్ల క్రితమే షాజహాన్ ఇంతగొప్ప వివాహం చేశారన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. ఇంత ఖర్చు చేసి భవిష్యత్ తరాలు చేస్తాయా? లేదా అనేది చెప్పలేం. కానీ ప్రపంచంలో అత్యంత ఖర్చుతో కూడుకున్న వివాహం మన భారతదేశంలోనే జరగడం నిజంగా గర్వించదగ్గ విషయం.

ఇది కూడా చదవండి: పుట్టిన 3రోజుల వరకు ఏడవలేదు..పాలు తాగలేదు..ప్రపంచపు మొట్టమొదటి అఘోరా..!!

Advertisment
తాజా కథనాలు