Aman Jaiswal: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ టీవీ యాక్టర్ మృతి!
ప్రముఖ టీవీ యాక్టర్ అమన్ జైస్వాల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. శుక్రవారం ముంబైలోని జోగేశ్వరి రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. జైస్వాల్ వెళ్తున్న మోటార్‌బైక్‌ను ట్రక్కు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.