Winter Care Tips: చలికాలంలో పిల్లల చర్మం పొడిబారుతోందా? ఇలా చేస్తే చర్మం కాంతివంతగా మారుతుంది..!

పెద్దల చర్మం కంటే.. చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణ మార్పులకు చాలా త్వరగా ప్రభావితం అవుతుంది. చల్లటి గాలి, తక్కువ తేమ స్థాయిలు పిల్లల సున్నితమైన చర్మాన్ని పొడిగా మారుస్తాయి. అందుకే చలికాలంలో పిల్లల చర్మ సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి.

New Update
Winter Care Tips: చలికాలంలో పిల్లల చర్మం పొడిబారుతోందా? ఇలా చేస్తే చర్మం కాంతివంతగా మారుతుంది..!

Winter Baby Care Tips: శిశువు చర్మం చాలా మృదువుగా, సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో పిల్లల చర్మం పొడిబారడం(Baby Skin Care) సర్వసాధారణం. పొడి చర్మం కారణంగా దురద మొదలవుతుంది. ఇది పిల్లల్లో చికాకు కలిగిస్తుంది. అందుకే.. శీతాకాలంలో(Winter) శిశువు చర్మం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శిశువు చర్మం పెద్దల చర్మం కంటే చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణ మార్పులకు త్వరగా ప్రతిస్పందిస్తుంది. చల్లటి గాలి, తక్కువ తేమ స్థాయిలు వారి సున్నితమైన చర్మాన్ని పొడిగా చేస్తాయి. అందుకే.. తల్లిదండ్రులు శీతాకాలంలో శిశువు చర్మ సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

చలికాలంలో శిశువు చర్మం సంరక్షణకు పాటించాల్సిన చర్యలివే..

తక్కువ సమయం స్నానం చేయించాలి..

స్నానం చేయడం వల్ల శిశువు చర్మం పొడిబారకుండా ఉండాలంటే స్నానం చేసే వ్యవధిని తగ్గించడం మంచిది. ముఖ్యంగా పడుకునే ముందు స్నానం చేయించకూడదు. అలాగే, అధిక వేడి నీటితో స్నానం చేయించొద్దు. చర్మంపై తేమ తగ్గకుండా ఉండటానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి.

సున్నితమైన క్లెన్సర్‌లను ఉపయోగించాలి..

చిన్న పిల్లలకు స్నానం చేయించేందుకు మంచి బ్రాండ్ బాడీ వాష్‌ను గానీ, సబ్బును ఉపయోగించాలి. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. పిల్లల చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. సేంద్రీయ ఉత్పత్తులు ఉత్తమం. కూరగాయల నూనెలు, వెన్న నుంచి వీటిని తయారు చేస్తారు. ఇవి పిల్లల చర్మానికి మేలు చేస్తాయి.

బాగా మాయిశ్చరైజ్ చేయండి..

పిల్లల చర్మం పొడిబారకుండా ఉండటానికి, చల్లని వాతావరణం నుండి శిశువు సున్నితమైన చర్మాన్ని రక్షించడానికి ప్రతిరోజూ స్నానం చేసే ముందు, నిద్రవేళలో నూనెతో మసాజ్ (Massage) చేయాలి. నూనెలోని కొవ్వు ఆమ్లాలు తేమను తిరిగి నింపుతాయి. అంతేకాదు, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

కాటన్ దుస్తులు వేయాలి..

చల్లని గాలి తగలకుండా ఉండటానికి పిల్లలకు కాటన్ ఫుల్-స్లీవ్ డ్రెస్ (Cotton Dresses) వేయడం ఉత్తమం. శిశువు ఇబ్బంది పడకుండా ఉండేందుకు మృదువైన, మంచి కాటన్ దుస్తులను వేయాలి.

Also Read:

టార్గెట్ నకిరేకల్.. వేముల వీరేశం ఓటమికి కేసీఆర్ స్కెచ్ ఇదే!

మేం అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం..!!

Advertisment
తాజా కథనాలు