ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్ (Nakrekal) నియోజకవర్గంపై బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోటీలో ఉన్నారు. టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ ను వీడిన వేముల వీరేశం (Vemula Veeresham) కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. వీరేశంను గెలిపించడం కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ రంగంలోకి దిగారు. సమయం చిక్కినప్పుడల్లా వారు నకిరేకల్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. నకిరేకల్ కోమటిరెడ్డి ఫ్యామిలీ సొంత నియోజకవర్గం. గత ఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్ గెలవడంలో వారు కీలక పాత్ర పోషించారు. నాటి కాంగ్రెస్ అభ్యర్థికి వారు అన్ని విధాలుగా సహకరించారన్న టాక్ కూడా ఉంది. దీంతో ఈ సారి కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుని తమ సత్తా చాటాలని వారు భావిస్తున్నారు. తమను కాదని పార్టీని వీడిన చిరుమర్తి లింగయ్యను ఓడించాలన్న లక్ష్యంతోనూ వారు ఈ నియోజకవర్గంపై మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Rasamayi Balakishan: రసమయి నామినేషన్ ను తిరస్కరించాలని ఫిర్యాదు.. ఖమ్మం, కొత్తగూడెం, పెద్దపల్లిలోనూ..
TS Elections: టార్గెట్ నకిరేకల్.. వేముల వీరేశం ఓటమికి కేసీఆర్ స్కెచ్ ఇదే!
నకిరేకల్ లో ఇటీవల కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నట్లు గమనించిన బీఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని కంట్రోల్ లోకి తెచ్చేందుకు చెరుకు సుధాకర్ ను రంగంలోకి దించినట్లు సమాచారం. దీంతో పాటు రేపు కేటీఆర్, 20న కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
Translate this News: