Will Modi Break Nehru & Indira Gandhi Record: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) ముగిసిన అనంతరం వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. అన్ని సర్వేలు కూడా బీజేపీ మూడోసారి అధికారంలోకి రాబోతుందని తేల్చేశాయి. దాదాపు అన్ని సంస్థలు కూడా ఎన్డీయే కూటమికి 350కి పైగా సీట్లు వస్తాయని వెల్లడించాయి. ఎన్డీయే కూటమి (NDA) మళ్లీ అధికారంలోకి వస్తే ఈసారి కూడా ప్రధానమంత్రి మోదీయే కాబోతున్నారని బీజేపీ హైకమాండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే వరుసగా మూడోసారి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోదీ (PM Modi) మరో రికార్డును సృష్టించబోతున్నారు. ఇప్పటికే సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) కొన్ని రికార్డులు క్రియేట్ చేసింది. వాటిని ఇంతవరకు ఏ పార్టీ కూడా బ్రేక్ చేయలేదు. మరి బీజేపీ ఆ రికార్డులు బ్రేక్ చేస్తుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: ఇండియా కూటమికి 295-310 సీట్లు: సంజయ్ రౌత్
16 ఏళ్లు ప్రధానిగా నెహ్రూ
భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు గడిచాయి. ఇన్నేళ్లలో కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ కాలం భారత్‌ను పాలించింది. 1947లో మనకు స్వాతంత్యం వచ్చాకా.. మొదటిసారిగా మధ్యంతర ప్రధానమంత్రిగా జవహార్‌లాన్ నెహ్రు ఎంపికయ్యారు. ఆ తర్వాత 1951-52లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావండతో అప్పుడు కూడా నెహ్రునే ప్రధాని అయ్యారు. 1957, 1962 పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు అధికారం అప్పగించడంతో మళ్లీ నెహ్రునే ప్రధానిగా కొనసాగారు. 1947 నుంచి 1964 వరకు అంటే 16 సంవత్సరాల వరకు సుధీర్ఘకాలం దేశ ప్రధానిగా సేవలందిన ఏకైక ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు సృష్టించారు.
మూడుసార్లు ప్రధానిగా ఇందిరాగాంధీ
ఆ తర్వాత 1967, 1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ వరుసగా రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యారు. అలాగే 1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మరోసారి ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా మూడుసార్లు ప్రధానిగా ఎన్నికై దేశానికి సేవలందించిన నేతగా.. ఇందిరాగాంధీ మరో రికార్డు సృష్టించారు. నెహ్రు, ఇందిరాగాంధీ క్రియేట్ చేసిన రికార్డులు ఇంతవరకు ఆ స్థాయిలో ఏ నాయకుడు కూడా చేయలేకపోయారు. అయితే ఈసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తే.. వరుసగా మూడుసార్లు ప్రధానిగా ఎన్నికై.. దేశానికి సేవలందించిన నేతగా నరేంద్ర మోదీ మరో రికార్డును సృష్టిస్తారు.
సుధీర్ఘ కాలం అధికారంలో కాంగ్రెస్
ఇప్పటివరకు సుధీర్ఘకాలం దేశాన్ని పాలించిన పార్టీగా కాంగ్రెస్‌కు పేరుంది. ఇప్పుడు మూడోసారి బీజేపీ గెలిస్తే.. కాంగ్రెస్ తర్వాత ఎక్కువకాలం దేశాన్ని పాలించిన పార్టీగా బీజేపీ అవతరించబోతోంది. ఇప్పటివరకు బీజేపీ కేంద్రంలో నాలుగుసార్లు విజయం సాధించింది. వాజపేయ్ హయాంలో రెండుసార్లు, మోదీ హయాంలో రెండుసార్లు అధికారం దక్కించుకుంది. ఇప్పుడు మూడోసారి కూడా గెలిస్తే.. ఐదుసార్లు కేంద్రంలో అధికారం దక్కించుకున్న మరో అతిపెద్ద పార్టీగా బీజేపీ రికార్డు క్రియేట్ చేయబోతుంది.
యూపీఏకు 404 సీట్లు
1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య జరిగిన అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. యూనైటెట్ ప్రోగ్రెస్ అలయెన్స్ (UPA) తో కలిసి ఏకంగా 404 ఎంపీ సీట్లు సాధించింది. ఆ సమయంలో మొత్తం 514 ఎంపీ సీట్లు ఉండగా.. UPA 404 సీట్లు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. అప్పుడు ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ తర్వాత ఏ పార్టీ కూడా ఇంత పెద్ద మెజార్టీతో ఎంపీ సీట్లు సాధించలేదు. అయితే ఈసారి బీజేపీ.. ఎన్డీయే కూటమితో కలిసి 400 సీట్లు గెలవాలని లక్ష్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే.
Also Read: ఎగ్జిట్ పోల్స్ సంచలనం.. అంతా అనుకున్నట్టే.. అక్కడ అలా.. ఇక్కడ ఇలా
ఎన్డీయే రికార్డు క్రియేట్ చేస్తుందా ?
ఎక్కువ సర్వేలు ఎన్డీయేకు 350కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేయగా.. ఇండియా టీవీ - CNX సంస్థలు ఎన్డీయేకు 371 నుంచి 401 సీట్లు వస్తాయని తేల్చి చెప్పాయి. ఒకవేళ ఎన్డీయే 400 సీట్లు సాధిస్తే.. కాంగ్రెస్ తర్వాత అంత భారీ మెజార్టితో లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన పార్టీగా బీజేపీ మరో చరిత్ర సృష్టించబోతుంది. ఇదిలాఉండగా.. జూన్4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఆ రోజునే ఎన్డీయేకు, ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో NDA, INDIA కూటమిల మధ్య గట్టి పోటీ జరిగిన సంగతి తెలిసిందే. మరి ఈసారి ఫలితాలు ఎలా వస్తాయో తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.