యూపీలోని హత్రాస్‌లో జరిగిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మరణించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. అయితే భోలే బాబా పేరును మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకపోవడంతో అనేక అనుమానాలు వస్తున్నాయి. అయితే భోలే బాబాను అరెస్టు చేయకపోవడంపై పోలీసులు స్పందించారు. ' తొక్కిసలాట ఘటనకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించాం. ప్రాథమిక సమాచారం ఆధారంగా కొంతమందిని అరెస్టు చేశాం. ఇప్పటిదాకా భోలే బాబా జాడ తెలియలేదు. ఆయన్ను విచారించాల్సి ఉంది. కచ్చితంగా విచారిస్తాం. ఈ ఘటనలో ఆయన పాత్ర ఉంటే అరెస్టు చేస్తామని చెప్పారు. సేవాదార్ వేద్ ప్రకాశ్ మధుకర్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పర్మిషన్ తీసుకున్నారు. నిర్వాహక కమిటీ పర్మిషన్ తీసుకున్న నేపథ్యంలో అందులో ఉన్న ప్యానెల్ సభ్యులను అరెస్టు చేశామని' అలీగఢ్ రేంజ్ ఐజీ షలాబ్ మాథూర్ చెప్పారు.
Also read: దారుణం.. రెవెన్యూ కార్యాలయం ముందు నిప్పంటించుకున్నాడు
భోలే బాబా ఆచూకి చెబితే రూ.లక్ష రివార్డు
ప్రస్తుతం పరారీలో ఉన్న భోలే బాబా కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. అతడి ఆచూకీ చెప్పినవారికి రూ.లక్ష రివార్డును ప్రకటించినట్లు చెప్పారు. ఇప్పుడు తమ అదుపులో ఉన్నవారని ప్రశ్నిస్తున్నామని.. తొక్కిసలాటలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఏదైనా ఉందా అనేదానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. ఇదిలాఉండగా.. యూపీకి చెందిన భోలే బాబా అలియస్ సూరజ్ పాల్‌పై గతంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసులో దోషిగా తేలిన అతడు కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. బయటకు వచ్చిన తర్వాత భోలే బాబాగా అవతారమెత్తారు.
Also Read: దేవభూమిలో పొంగి పోర్లుతున్న నదులు..100 రహదారులు మూసివేత!