Pawan Kalyan: జీతం ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా..: పవన్‌!

తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను ప్రజల కష్టం, రక్తం, స్వేధం నుంచి వచ్చే డబ్బును జీతం రూపంలో తీసుకున్నప్పుడల్లా బాధ్యత గుర్తుకు రావాలని తీసుకుంటున్నానంటూ పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.

New Update
Pawan Kalyan: జీతం ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా..: పవన్‌!

Pawan Kalyan: పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించిన జనసేన విజేతలతో ఆయన బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన నూతన ఎమ్మెల్యే లకు, ఎంపీలకు కొన్ని సూచనలు చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను ప్రజల కష్టం, రక్తం, స్వేధం నుంచి వచ్చే డబ్బును జీతం రూపంలో తీసుకున్నప్పుడల్లా బాధ్యత గుర్తుకు రావాలని తీసుకుంటున్నానంటూ వెల్లడించారు. జీతం ముఖ్యం కాదని, అంతకు మించి నా సొమ్మును ప్రజలకు ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విలువైన అసెంబ్లీ బాధ్యతను ప్రజలు తనకి అప్పగించారని అన్నారు.

భారతదేశంలో ఏపీ కీలకమైందని , చిన్న నిర్ణయం ఎన్డీయే కు ఊత మిచ్చిందని అన్నారు. జనసేన గోరంత దీపమని.. కొండంత వెలుగునిచ్చిందనిపవన్‌ సంతోషం వ్యక్తం చేశారు. జనసేన అభ్యర్థులకంటే ఎక్కువ మెజార్టీ తనకు రావడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఉత్సహాన్ని బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. ప్రజలు బలమైన మార్పును కోరుకున్నారని, ప్రజల ఆకాంక్షలను గుండెలో పెట్టుకుని చూసుకోవాలని అన్నారు.

Also read: జనసేన పార్టీకు మరో గుడ్ న్యూస్

Advertisment
తాజా కథనాలు