Lokesh: తప్పుడు కేసులు ఏం చేయలేవు.. నారా లోకేశ్ సంచలన వాఖ్యలు

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం ఫ్యాక్షన్ మనస్థత్వంతో విపక్ష పార్టీపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించాడు.

Lokesh: తప్పుడు కేసులు ఏం చేయలేవు.. నారా లోకేశ్ సంచలన వాఖ్యలు
New Update

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం ఫ్యాక్షన్ మనస్థత్వంతో విపక్ష పార్టీపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించాడు. ఢిల్లీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ నివాసంలో టీడీపీ ఎంపీలతో సమావేశమైన ఆయన.. విపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఎదర్కోలేక జగన్‌.. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని విమర్శించారు. చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు, వైసీపీ సర్కార్‌ పెడుతున్న తప్పుడు కేసులపై టీడీపీ న్యాయ పోరాటం చేస్తుందన్నారు. మరోవైపు అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో తనను అక్రమంగా ఇరికించారని లోకేష్‌ తెలిపారు. ఆ కేసులో తనను A14గా నిందితుడిగా చేర్చడం దారుణం అన్నారు.

ఏపీ పోలీసులు అధికార పార్టీ కింద కుక్కల్లా పని చేస్తున్నారని లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజా నిజాలు తెలుసుకోకుండా అధికార పార్టీకి చెందిన నేతలు ఫలానా కేసులు పెట్టాలని ఆదేశిస్తే.. పోలీసులు అవి నిజమా కాదా అని ఆలోచించకుండా ఆ కేసులు పెడుతున్నారని, దీంతో వారు చట్టాన్ని ఉల్లంఘించిన వారు అవుతున్నారన్నారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదన్న లోకేష్‌.. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు లేకపోయినా అందులో తనను A14గా ఎలా చేర్చుతారని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో యువగళం పాదయాత్రకు ప్రజా స్పందన వస్తుండటంతో అధికార పార్టీ నేతలు చూస్తూ ఓర్వలేకపోతున్నారని, ఎలాగేనా పాదయాత్రను అడ్డుకోవాలని కొత్త కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అరాచక వైసీపీ పాలనపై తెలుగు దేశం పార్టీ తలపెట్టిన జనచైతన్య కార్యక్రమాల్లో ఓ ఒక్కటీ ఆగవని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా యువగళం పాదయాత్ర ఆగే సమస్యే లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఎపీలో జరుగుతున్న కక్ష సాధింపు రాజకీయం జాతీయ స్థాయిలో ఎండగట్టాలని లోకేష్‌ పిలుపునిచ్చారు. టీడీపీ ఏ తప్పూ చేయలేదని, మనవైపు న్యాయం ఉందని, ఇవి జాతీయ స్థాయిలో అందరికీ తెలిసే విధంగా పోరాటం చేయాలని సూచించారు.

#nara-lokesh #tdp #chandrababu #amaravati #padayatra #mps #struggle #galla-jayadev #inner-ring-road #bheti #illegal-arrest #a14 #national-level #yavagalam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe