NDA Alliance: బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే జరిగే మార్పులు ఏంటీ ? ఎగ్జిట్ పోల్స్‌లో అన్ని సర్వేలు కూడా ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఒకవేళ ఎన్డీయే కూటమి మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయే ఇప్పుడు చూద్దాం. By B Aravind 02 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఎగ్జిట్ పోల్స్‌లో అన్ని సర్వేలు కూడా ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేయడంతో.. బీజేపీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఒకవేళ ఎన్డీయే కూటమి మరోసారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపడితే వరుసగా మూడోసార్లు ఎన్నికైన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు క్రియేట్ చేయనున్నారు. 2014 నుంచి 2024 వరకు సాగిన బీజేపీ పాలనలో.. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, రామమందిర నిర్మాణం లాంటి సున్నితమైన అంశాలు పరిష్కారమయ్యాయి. ఒకవేళ ఈసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తే.. వచ్చే ఐదేళ్లలో ఎలాంటి మార్పులు జరగబోతాయే ఇప్పుడు తెలుసుకుందాం. తొలి వంద రోజుల్లోనే కీలక నిర్ణయాలు తాము అధికారంలోకి వస్తే.. తొలి వంద రోజుల్లో కొన్ని కీలకమైన పాలసీలను అమలు చేస్తామని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీ సర్కార్.. 167 ఐడియాలను షార్ట్‌లిస్ట్ చేసింది. అక్టోబర్ 15 నాటికి వాటిని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఇటీవల యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు ముందే దీన్ని అమలు చేస్తారని అందరూ భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. అయితే ఈసారి మాత్రం యూసీసీని బీజేపీ కచ్చితంగా అమలు చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలవుతోంది. దేశంలోనే యూసీసీని అమలు చేస్తున్న రాష్ట్రంగా ఉత్తరఖాండ్ నిలిచింది. Also read: నెహ్రూ, ఇందిరా గాంధీ రికార్డులు మోదీ బ్రేక్ చేస్తారా ? సీఏఏ పూర్తిగా అమల్లోకి మరో వివాదస్పదమైన అంశం పౌరసత్వ సవరణ చట్టం(CAA). 2019లో సీఏఏ ఆమోదం పొందగా ఇటీవలే దాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. సీఏఏకు నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపినా కూడా.. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవ్వడంతో దీని అమలు వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చట్టానికి సంబంధించి నియమ నిబంధనలను కూడా కేంద్రం ఇటీవల విడుదల చేసింది. మతం ప్రాతిపదికగా భారత పౌరసత్వం కల్పించబోయే మొదటి చట్టమిది. 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు దీని ప్రకారం ఎలాంటి రుజువులు, ధ్రువీకరణలతో సంబంధం లేకుండా పౌరసత్వం కల్పిస్తారు. కానీ ముస్లింలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. పౌరసత్వం కావాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ప్రకటించింది. మరో ఐదేళ్లు బీజేపీ అధికారంలో ఉంటే దేశవ్యాప్తంగా పూర్తిగా సీఏఏ అమల్లోకి వస్తుంది. అయితే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాల్లో సీఏఏను అమలు చేయబోమని ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పీవోకే విలీనం మరో కీలకమైన అంశం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK). భారత్‌లో పీవోకే విలీనం కాబోతుందని ఇటీవల పలువురు బీజేపీ నాయకులు ప్రకటనలు చేశారు. పీవోకేను స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు పీవోకే.. విదేశీ భూభాగమని పాకిస్థాన్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. దీంతో బీజేపీ హయాంలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) త్వరలో ఇండియాలో విలీనం అయ్యే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరగనున్న సంగతి తెలిసిందే. మరీ ఎన్డీయే, ఇండియా కూటమిలకు ఈసారి ఎన్ని సీట్లు వస్తాయే తెలియాలంటే ఆ రోజు వరకు ఎదురుచూడాల్సిందే. Also read: అవి మోదీ పోల్స్.. 295 సీట్లతో అధికారం మాదే: రాహుల్ గాంధీ #telugu-news #pm-modi #bjp #lok-sabha-elections #nda #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి