Harish Rao: కర్నాటకలో ఇచ్చిన హామీల సంగతేంటి.. కాంగ్రెస్‌పై హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ పార్టీపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.

New Update
Harish Rao: కర్నాటకలో ఇచ్చిన హామీల సంగతేంటి.. కాంగ్రెస్‌పై హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ పార్టీపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీలను ముందు కర్నాటకలో నేరవేర్చి ఆ తర్వాత తెలంగాణలో ప్రకటించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు కర్నాటకలో ఎన్ని హామీలు ఇచ్చారో.. అందులో ఎన్ని హామీలను నెరవేర్చారో ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌ పార్టీకి ఓటువేస్తే పాత కాలానికి వెళ్తారన్నారు.

2014వ సంవత్సరానికి ముందు తెలంగాణలో విద్యుత్‌ సరిగ్గా ఉండేది కాదన్నారు. కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు మోటర్ల వద్ద పడుకొని పాము కాటుకు, తేలు కాటుకు బలైన సంఘటనలు ఉన్నాయన్నారు. గతంలో కేవలం 3 గంటల విద్యుత్‌ మాత్రమే రావడంతో ఒక్క ఎకరానికి కూడా సాగు నీరు అందేది కాదని, దీంతో పంట కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలేవని గుర్తు చేశారు. దీంతో తాము అప్పు చేసి మరి పంటలు వేసుకుంటే అవి కళ్ల ముందే నాశనం అవుతుంటే మనస్థాపానికి గురైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయన్నారు.

2014వ సంవత్సరం ముందు కరెంట్‌ ఉంటే వార్త అన్న ఆయన.. కానీ ఇప్పుడు పరిస్థితి కరెంట్‌ పోతే వార్తగా మారిందన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని విధాలుగా ఆభివృద్ధి చేశారన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ విశ్వ నగరంగా మారిందని హరీష్‌ రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు మాత్రమే పెట్టుబడులు వస్తున్నాయన్న ఆయన.. రానున్న రోజుల్లో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు పెట్టుబడులు రానున్నాయన్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు భారీ ఎత్తున పెరిగే అవకాశం ఉందని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

Also Read: చంద్రబాబు అరెప్ట్‌పై కాంగ్రెస్‌ నేత మధు యాష్కి సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు