Mamata Banerjee Challenge BJP to 200 Seats: లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల రంగంలోకి దిగాయి. ఎన్నికల్లో 370 సీట్లు సాధించాలని.. ఎన్డీయే కూటమితో కలిపి 400 సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై సంచలన వ్యాఖ్యల వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 200 మార్కునైనా దాటుతారా అంటూ ఆ పార్టీకి సవాలు చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో 200కు పైగా స్థానాల్లో గెలుస్తామని బీజేపీ ప్రచారాలు చేసిందని.. చివరికి 77 సీట్లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు.
Also Read: ప్రధాని మోదీనే కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు-సునీత కేజ్రీవాల్
సీఏఏకు ఎవరూ దరఖాస్తు చేసుకోవద్దు
టీఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రాకు మద్దతుగా ఆమె కృష్ణానగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు.. తనపై దుష్ప్రచారాలు చేసి లోక్‌సభ నుంచి బహిష్కరించినట్లు పేర్కోన్నారు. అంతేకాదు పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA)ను పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయమంటూ దీదీ స్పష్టం చేశారు. సీఏఏకు అప్లై చేసుకుంటే ప్రజలు విదేశీయులుగా మారుతారంటూ ధ్వజమెత్తారు. అందుకే సీఏఏ కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోకూడదంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. చట్టబద్ధంగా ఉన్న పౌరులను విదేశీయులుగా మార్చేందకు సీఏఏ ఒక ఉచ్చు అంటూ విమర్శలు చేశారు.
కాంగ్రెస్, సీపీఎంలు బీజేపీ వైపే
పశ్చిమ బెంగాల్‌లో CAA, NRCకి అనుమతించబోమన్నారు. అలాగే ఇండియా కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, సీపీఎం పార్టీలపై కూడా దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి లేదని.. కాంగ్రెస్, సీపీఎంలు కలిసి బీజేపీ కోసం పనిచేస్తున్నాయంచూ ఆరోపణలు చేశారు.
Also read: సత్తుపల్లిలో పోలీసులపై గిరిజనులు దాడి..సీఐ కిరణ్‌ను కర్రలతో ఎలా కొట్టారో చూడండి!