/rtv/media/media_files/2025/05/19/iA3GBL6T0BwcWGu9HJVz.jpg)
Rains
తెలంగాణలోని హైదరాబాద్‌లో మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ అంతటా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీలో గచ్చిబౌలి,మాదాపూర్, మలక్‌పేట్, అమీర్‌పేట్, కేపీహెచ్‌బీ, పటాన్‌చెరువు, దిల్‌సుఖ్ నగర్, మియాపూర్,పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చూడండి: Heavy rains :భయటకు వెళ్తున్నారా? జర ఫైలం...తెలంగాణలో దంచికొడుతున్న వర్షం
#WeatherUpdate :
— Surya Reddy (@jsuryareddy) August 12, 2025
India Meteorological Dept (IMD) has issued, #RedAlert warning of extremely #HeavyRainfall in some dists of #Telangana for 2 days, while #OrangeAlert warning of heavy to very heavy rainfall in #Hyderabad and several other dists.#HyderabadRains#TelanganaRainspic.twitter.com/pUR2yjgljS
తెలంగాణలో ఈ జిల్లాల్లో
ఇకపోతే తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. తప్పని పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు.
Check this impact based zone wise forecast for #Hyderabad and plan your day accordingly. Rains likely to pick up pace from this evening #HyderabadRains#TelanganaRainspic.twitter.com/Exy0VpjyWR
— TNIE Telangana (@XpressHyderabad) August 13, 2025
ఏపీలో ఈ జిల్లాల్లో..
ఏపీలో విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే మత్స్యకారులు అసలు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రతీర ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలను సూచించారు.
Heavy Rainfall Alert 🌧️
— India Meteorological Department (@Indiametdept) August 12, 2025
Telangana: Very heavy to extremely heavy rain likely in isolated areas from 13th to 16th August.
Coastal Andhra Pradesh, Yanam & Rayalaseema: Isolated heavy to very heavy rain expected on 13th & 14th August.
⚠️ Safety First:
• Postpone non-essential… pic.twitter.com/cQanKxxGje
ఇది కూడా చూడండి:Hyderabad Heavy Rains : మరోసారి నీటమునిగిన భాగ్యనగరం...బయటకు వచ్చారో ఇక అంతే...