/rtv/media/media_files/2024/12/17/ZzD8GGryUoFCRIEf0ECk.jpg)
Heavy rains
Heavy rains : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, అల్పపీడనం మూలంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోజు వర్షాలతో హైదరాబాద్, వరంగల్ నగరాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. మంగళవారం రాత్రి మొదలైన వర్షాలు బుధవారం తెల్లవారుజామున కూడా కొనసాగుతున్నాయి.ఈశాన్య, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే మంచిర్యాలలోని భీమిని, కన్నెపల్లిలో అత్యధికంగా 20.7 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే రెండు గంటల్లో నల్గొండ, నాగర్ కర్నూల్, గద్వాల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డిలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజధాని నగరం అయిన హైదరాబాద్ లో మధ్యాహ్నం తరువాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read: అమెరికాలో ఇంటిపై పడిన ఉల్క.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సైంటిస్టులు!
వర్షాల మూలంగా అవసరమైన రక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి సెలవులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అధిక వర్షాలు, వరద ప్రభావం తీవ్రంగా ఉండే ప్రాంతాలకు సహాయక సిబ్బందిని ముందస్తుగా పంపించాలని అధికారులు తెలిపారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే హెలికాప్టర్ ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే సైన్యం నుంచి సాయం తీసుకోవడానికి సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి. సమస్య ఎక్కడ తలెత్తినా తక్షణమే పరిష్కరించాలని సూచించారన్నారు. వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. గర్భిణులను తక్షణమే తరలించేలా అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుకోవాలి. స్థానికంగా తక్షణ సహాయ చర్యల కోసం కలెక్టర్లు మీ దగ్గర ఉన్న విపత్తు నిధులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ర్టంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు రానన్న 72 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు, సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వర్షాపాత పరిస్థితులను అంచనా వేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, ఎంతటి భారీ వర్షాలు వచ్చినా ప్రాణ, ఆస్తి, పశు సంపదకు నష్టం వాటిల్లకుండా చూడాలని సీఎం ఆదేశించారు. పశువులు, గొర్రెలు, మేకల కాపరులు తరచూ వాగుల్లో చిక్కుకొనిపోతున్నారని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో వర్షాల పై ముందస్తుగా వారిని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు.ఈ మేరకు అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Also Read : నిజం సింహం లాంటిది.. KTR లీగల్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే