Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. రాష్ట్రంలో నేడు దంచికొట్టనున్న వర్షాలు!

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఏపీ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update
Hyderabad Heavy Rains

Hyderabad Heavy Rains

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపారు. అనవసరమైన ప్రయాణాలను ఆపుకోవాలని వెల్లడించారు. ఈ జిల్లాలతో పాటు మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఇది కూడా చూడండి: Crime News : థూ..ఏం కొడుకువురా...కన్నతల్లినే చెరబట్టిన కొడుకు...కొట్టి చంపిన తండ్రి

కొన్ని ఏరియాల్లో భారీ వర్షాలు..

హైదరాబాద్‌లో ప్రస్తుతం కొన్ని ఏరియాలో వర్షం కురుస్తోంది. రాత్రంతా వర్షం కురవగా నేటి నుంచి మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా సికింద్రాబాద్, తార్నాక్, కూకట్‌పల్లి, మాధాపూర్, హైటెక్ సిటీ, యూసఫ్‌గూడ, జూబ్లిహిల్స్, దుర్గం చెరువు, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎర్రగడ్డ, పఠాన్‌చెరువులో భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల వారు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపారు. అలాగే వర్షానికి కరెంటు స్తంభాలు, పాతబడిన గొడల దగ్గర ఉండకూడదని అంటున్నారు. ఏ మాత్రం అజాగ్రత్త వల్ల అయినా షాక్ కొట్టే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. అయితే తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చూడండి: Road accident : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు

Advertisment
తాజా కథనాలు