Weather Update: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వారం రోజుల పాటు వర్షాలే వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం తెలంగాణలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, వరంగల్, నిజమాబాద్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

New Update
Hyderabad Heavy Rains

Hyderabad Heavy Rains

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం తెలంగాణలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, రంగారెడ్డి, వరంగల్, నిజమాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వారం రోజుల పాటు వర్షాలే వర్షాలు

ఈ జిల్లాల్లో వర్షాలు..

అలాగే ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మూడు రోజుల పాటు ఒకటే వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లోతట్లు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని సూచించారు.

ఇది కూడా చూడండి: Arattai app: వాట్సాప్‌కు పోటీగా ఇండియా యాప్.. సేమ్ టూ సేమ్

Advertisment
తాజా కథనాలు