/rtv/media/media_files/2025/08/19/rains-2025-08-19-07-59-05.jpg)
rains
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణలో కూడా రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చూడండి: Telangana Rising Vision-2047 : రాష్ట్రంలో మరో సర్వే!.. తెలంగాణలో మరో సర్వే...తెలంగాణ రైజింగ్ విజన్-2047 పేరిట ప్రారంభం
HyderabadRains UPDATE 1 ⚠️🌧️
— Telangana Weatherman (@balaji25_t) October 13, 2025
MASSIVE YADADRI - BHONGIR DOWNPOURS is pushing rains towards us. Get ready Hyderabad people for STEADY LIGHT - MODERATE SHOWERS in next 1-2hrs in many parts of the city 🌧️🌧️
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే హన్మకొండ, వరంగల్, జనగాం, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే తెలంగాణలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
MASSIVE OVERNIGHT DOWNPOURS LASHED SOUTH EAST TG ⚠️⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) October 13, 2025
As mentioned in overnight forecast, SEVERE THUNDERSTORMS with HEAVY RAINFALL occured across Nalgonda, Suryapet, Khammam, Mahabubabad, Bhadradri - Kothagudem, Warangal Mulugu with 100mm rainfall recorded in few places ⚠️…
ఇది కూడా చూడండి: Hyderabad : ఎల్‌బీనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురికి తీవ్రగాయాలు