Weather Update: బిగ్ అలర్ట్.. మొంథా తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను నేడు తీరం దాటనుంది. రాత్రి 9 గంటల తర్వాత ఏపీలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

New Update
 Heavy rains in Telangana.

Heavy rains

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను నేడు తీరం దాటనుంది. రాత్రి 9 గంటల తర్వాత ఏపీలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. నేడు రాత్రి 9 తర్వాత అంతర్వేది, రాజోలు, అమలాపురం, దేవగుప్తం, కాట్రేనికోన, పోలవరం, యానాం, గుట్టెనదీవి, ముమ్మిడివరం దగ్గర తుపాను తీరం దాటనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Water Supply: హైదరాబాద్ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో 85 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయానికి ఈ వేగం మరింత పెరుగుతుంది. అయితే ఈ తుపాను ప్రభావం వల్ల కోస్తాంధ్ర, యానంలో 30వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరులో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు.

ఇది కూడా చూడండి: Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అర్జెంట్ అయితేనే ఏపీకి వెళ్లండి.. ఎందుకంటే?

Advertisment
తాజా కథనాలు