/rtv/media/media_files/2025/10/26/water-supply-2025-10-26-12-06-13.jpg)
water supply
నగరంలో జరుగుతున్న ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) కీలకమైన పైప్‌లైన్ విస్తరణ పనులను చేపట్టనుంది. ప్యారడైజ్ జంక్షన్ వద్ద 800 మి.మీ వ్యాసం గల ఎంఎస్ (మైల్డ్ స్టీల్) పైప్‌లైన్ పొడిగింపు పనులను చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనుల కారణంగా పలు ప్రాంతాల్లో 18 గంటల పాటు నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలగనుంది.
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు:
పైప్‌లైన్ పొడిగింపు పనులు అక్టోబర్ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 28వ తేదీ ఉదయం 6 గంటల వరకు మొత్తం 18 గంటల పాటు నిరంతరాయంగా జరుగుతాయి. మారెడ్‌పల్లి నుంచి స్పోర్ట్స్ గ్రౌండ్, లీ రాయల్ జంక్షన్, బాలామ్రాయి మీదుగా కంట్రోల్ రూమ్‌కు ఎంఎస్ పైప్‌లైన్‌ను అనుసంధానించే పని ఈ విస్తరణలో భాగం. ఈ పనుల వల్ల కింది ప్రాంతాలలో నీటి సరఫరాకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఓప్రకటనలో తెలిపారు. ఆ నివాస ప్రాంతాలు.. నల్లకుంట, ప్రకాష్ నగర్, మేకలమండి, భోలక్‌పూర్, హస్మత్‌పేట్.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో కాల్పుల కలకలం..సెల్‌ఫోన్ దొంగలపై డీసీపీ ఫైరింగ్
ముఖ్య సంస్థలు/ప్రాంతాలు.. దక్షిణ మధ్య రైల్వే కార్యాలయ ప్రాంతాలు, బేగంపేట విమానాశ్రయం (Begumpet Airport), బాలామ్రాయి పంపింగ్ స్టేషన్ పరిసర ప్రాంతాలు. ఈ పైప్‌లైన్ పనుల కారణంగా నీటి సరఫరా నిలిచిపోయే అవకాశం ఉన్నందున.. ఆయా ప్రాంతాల ప్రజలు, సంస్థలు ఈ 18 గంటల అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని హెచ్‌ఎండీఏ అధికారులు విజ్ఞప్తి చేశారు. పనులను సకాలంలో పూర్తి చేసి తిరిగి నీటి సరఫరాను పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించి.. ఈ తాత్కాలిక అసౌకర్యాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి: కవితపై సంచలన ఆరోపణలు..రూ.2వేల కోట్ల విలువచేసే భూ కబ్జా ?
Follow Us