Monsoon: రైతన్నలకు GOOD NEWS

మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనున్నట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. మే 27కే నైరుతి రుతుపవనాలు పశ్చిమ తీరాన్ని తాకుతాయని ఐఎండీ తెలిపింది.

New Update
Monsoon likely to reach Kerala on May 27, Says IMD

Monsoon likely to reach Kerala on May 27, Says IMD

వేసవి ఉష్ణోగ్రతలను తరిమి కొట్టే సమయం వచ్చింది. ఇండియాలకు వర్షాకాలాన్ని తీసుకొచ్చే నైరుతి రుతుపవనాల గురించి ఐఎండీ మంగళవారం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న 4 లేదా 5 రోజుల్లో నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను తాక‌నున్నట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ వెల్లడించింది. సాధార‌ణంగా జూన్ ఒక‌టో తేదీన నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను తాకుతాయి. కానీ ఈయేడాది అటుఇటుగా వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు పశ్చిమ తీరాన్ని తాకనున్నాయి.

ఇక ఈ యేడాది మే 27వ తేదీ వ‌ర‌కు నైరుతి కేర‌ళ చేర‌నున్నట్లు కొన్ని రోజుల క్రితం ఐఎండీ పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఒక‌వేళ అనుకున్నట్లు నైరుతి కేర‌ళ‌కు వ‌స్తే, 2009 త‌ర్వాత కేర‌ళకు నైరుతి రుతుపవనాలు చాలా ముందుగా రానున్నట్లు భావిస్తున్నారు. రాబోయే 4, 5 రోజుల్లో కేర‌ళ‌ను నైరుతి తాకే సంద‌ర్భాలు అనుకూలంగా ఉన్నట్లు ఇవాళ భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

(monsoon-lottery | telugu states monsoon | latest-telugu-news | Cold Weather | andhra pradesh weather | India Weather News)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు