రూ.250టికెట్కు 10 కోట్ల లాటరీ ప్రైజ్.. నక్కతోక తొక్కిన మహిళా మున్సిపల్ కార్మికులు....!!
అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు. అందరూ కలిసి డబ్బులు పోగేసుకున్నారు. రూ. 250 విలువ చేసే లాటరీ టికెట్ ను కొనుగోలు చేశారు. తొమ్మిది మంది తలో రూ. 25ఇచ్చారు. మరో ఇద్దరు రూ. 12.50వేసుకుని..టికెట్ కొనుగోలు చేశారు. ఆ విధంగా మున్సిపల్ కార్మికులైన మహిళలు డబ్బులు పోగేసి కొనుగోలు చేసిన లాటరీ టికెట్కు జాక్పాట్ తగిలింది.