/rtv/media/media_files/2025/05/23/69qphF8teYLts75Zci4o.jpg)
GT VS LSG
ఐపీఎల్ నుంచి వెళ్ళిపోయింది కానీ లాస్ట్ మ్యాచ్ లో తన ప్రతాపం చూపించింది లక్నో. గుజరాత్ ను 33 పరుగుల తేడాతో ఓడించి చుక్కలు చూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ 235 పరుగులు చేసింది. ఆ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ ను కట్టడి చేశారు జెయింట్స్ బౌలర్లు. గుజరాత్ 9 వికెట్లకు 202 పరుగులే చేయగలిగింది. టైటాన్స్ టీమ్ లో షారుఖ్ ఖాన్ 29 బంతుల్లో 5×4, 3×6లతో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఎల్‌ఎస్‌జీ బౌలర్లలో ఒరూర్క్ (3/27), ఆయుష్ బదోని (2/4) రాణించారు. 13 మ్యాచ్‌ల్లో గుజరాత్‌కిది 4వ ఓటమి కాగా.. లక్నోకు 6వ ఓటమి. గుజరాత్ బ్యటార్లలో సాయి సుదర్శన్ 21, శుభ్ మన్ 35, బట్లర్ 33 కొట్టినా లక్ష్యాన్ని మాత్రం అందుకోలేకపోయారు.
లక్నో బ్యాటర్లు చితక్కొట్టారు..
అంతకు ముందు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 20 ఓవర్లలో 235/2 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 117, పూరన్ రన్స్‌తో స్టేడియాన్ని హోరెత్తించారు. ఓపెనర్ మార్కరమ్, మార్ష్ ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించారు. తొలి ఓవర్ నుంచే లఖ్ నవూ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సిక్సులు, ఫోర్లలో స్టేడియాన్ని హోరెత్తించారు. మార్కరమ్ 24 బంతుల్లో 3ఫోర్లు 2 సిక్సులతో 36 పరుగులు చేశాడు. మార్ష్ 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సులతో 117 రన్స్ చేశాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 27బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 56 పరుగులు చేశాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 6 బంతుల్లో 2 సిక్సరల్లో 16 పరుగులు చేశాడు. ఇక గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్ 1, సాయి కిషోర్ 1 వికెట్ తీశారు.
today-latest-news-in-telugu | IPL 2025 | LSG vs GT | match