ఏపీ వైపుగా అల్పపీడనం.. నేడు, రేపు జాగ్రత్త!

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారనుంది. దీంతో ఏపీతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచనలు చేసింది.

New Update
ap rains

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ వైపుగా వస్తోంది. ఇది కాస్త తీవ్ర అల్పపీడనంగా మారుతుండటంతో ఏపీతో పాటు తమిళనాడులో కూడా నేడు, రేపు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఏపీలో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, డా.బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇది కూడా చూడండి: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు

ఇది కూడా చూడండి: టాలీవుడ్‌లో విషాదం.. బలగం మొగిలయ్య ఇకలేరు

మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని..

అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్ఠంగా 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వేతో పాటు అన్ని జిల్లాలకు అధికారులు హెచ్చరికలు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచనలు చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఎవరూ బయటకు వెళ్లవద్దని సూచనలు చేశారు. అలాగే పంట చేతికి వచ్చే రైతులు.. జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే కోత కోసిన పంట తడవకుండా ఉండేందుకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: BREAKING: ప్రముఖ రచయిత కన్నుమూత

ఇది కూడా చూడండి: హైదరాబాద్ బుక్ ఫెయిర్.. నేటి నుంచే ప్రారంభం

Advertisment
తాజా కథనాలు