ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు తాను జైల్లో ఉన్నట్లైతే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఢిల్లీలో ఉన్న మొత్తం 70 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలందరినీ జైల్లో నిర్బంధించి ఎన్నికలు జరపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన సవాలు చేశారు. ప్రజలు అమాయకులని బీజేపీ పాలకులు భావిస్తున్నారంటూ పేర్కొన్నారు.
Also Read: ప్రజ్వల్‌ను దేవెగౌడే విదేశాలకు పంపించారు: సిద్ధరామయ్య
ఢిల్లీ ప్రజలే కమలం పార్టీకి దీటుగా సమాధానం ఇస్తారంటూ చెప్పుకొచ్చారు. అయితే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి.. జైల్లోకి వెళ్లినా కూడా ముఖ్యమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని విలేకరి ప్రశ్నించారు. దీనికి కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఒకవేళ తాను రాజీనామా చేస్తే ఆ తర్వాత బెంగాల్‌లో మమతా బెనర్జీ, కేరళలో పినరయ్ విజయన్, తమిళనాడులో స్టాలిన్ ఇలా విపక్ష ముఖ్యమంత్రులను కూడా మోదీ ప్రభుత్వం లక్ష్యం చేసుకుంటుందని అన్నారు.
విపక్ష నేతలను అరెస్టు చేసి.. ప్రభుత్వాలను కూల్చివేయాలని బీజేపీ కోరుకుంటోందని కేజ్రీవాల్ అన్నారు. తనకు పదవిపై ఆశ లేదని.. తాను రాజీనామా చేస్తే అది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని చెప్పారు. మురికివాడల్లో పని చేయడం కోసం.. తాను ఆదాయ పన్ను శాఖ కమిషనర్ పదవిని కూడా వదులుకోని రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా తమ పోరాటంలో భాగమని.. ఈసారి కూడా తాను ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగనని క్లారిటీ ఇచ్చారు.
Also read: రేవ్ పార్టీలో పోలీసుల హస్తం.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. వెలుగులోకి సంచలన విషయాలు!