Heavy Rains : భారీ వర్షాలు.. నిండుకుండలా మారిన జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు కర్ణాటకలో వర్షాల దంచికొడుతున్నాయి. దిగువకు భారీగా వరద ప్రవహించడంతో జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి జూరాలకు భారీగా వరద చేరుతోంది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం జలాశయం వైపు కృష్ణా నది పరుగులు తీస్తోంది. By B Aravind 21 Jul 2024 in Latest News In Telugu మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి Jurala And Tungabhadra Projects : తెలంగాణ (Telangana), ఏపీ (Andhra Pradesh), కర్ణాటక (Karnataka) రాష్ట్రాల్లో వర్షాల దంచికొడుతున్నాయి. దిగువకు భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి జూరాలకు భారీగా వరద చేరుతోంది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం జలాశయం వైపు కృష్ణా నది పరుగులు తీస్తోంది. జూరాల ప్రాజెక్టులు (Jurala Project) అధికారులు 17 గేట్లు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 82 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 73 వేల క్యూసెక్కులు ఉంది. Also Read: ఐటీ ఉద్యోగులకు షాక్.. రోజుకు 14 గంటలు పని ! పూర్థిస్థాయి నీటి సామర్థ్యం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి సామర్థ్యం 317.160 మీటర్లుగా ఉంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయినట్లు తెలుస్తోంది. మరోవైపు తుంగభద్ర డ్యామ్‌కు కూడా వరద ప్రవాహం పెరగడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Also Read: రీల్స్ కోసం బైక్‌పై స్టంట్స్.. స్పాట్‌లోనే యువకుడు మృతి #jurala-project #telangana-news #floods #heavy-rains #telugu-news #tungabhadra-projetct మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి