సోషల్ మీడియాలో రీల్స్ చేసి గుర్తింపు తెచ్చుకునేందుకు కొందరు ప్రమాదకరంగా స్టంట్లు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్లోని హయాత్నగర్లో చోటుచేసుకుంది. రీల్స్ కోసం బైక్పై స్టంట్స్ చేసిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద అంబర్పేట్ నేషనల్ హైవే మీద ఈ ఘటన చోటుచేసుకుంది. వర్షం కురుస్తున్న సమయంలో KTM బైక్పై రీల్స్ చేసేందుకు ఇద్దరు యువకులు బైక్పై స్టంట్లు చేశారు. బైక్ అదుపుతప్పడంతో వెనకాల కూర్చున్న శివ అనే యువకుడు మృతి చెందాడు. బైక్ నడిపిన మరో యువకుడికి తీవ్రంగా గాయాలయ్యయి. ప్రస్తుతం ఇతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కొడుకు మృతితో అతడి తల్లి రోదనలు మిన్నంటాయి.
పూర్తిగా చదవండి..Hyderabad: రీల్స్ కోసం బైక్పై స్టంట్స్.. స్పాట్లోనే యువకుడు మృతి
హైదరాబాద్లోని హయాత్నగర్లో ఇద్దరు యువకులు రీల్స్ చేసేందుకు KTM బైక్పై స్టంట్లు చేశారు. బైక్ అదుపుతప్పడంతో వెనకాల కూర్చున్న శివ అనే యువకుడు మృతి చెందాడు. బైక్ నడిపిన మరో యువకుడికి తీవ్రంగా గాయాలయ్యయి.
Translate this News: