హరీష్ రావు - రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం.. కౌంటర్ల మీద కౌంటర్లు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా నడుస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బుధవారం హరీష్ రావు, రాజగోపాల్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. హరీష్ ను బీఆర్ఎస్ వాడుకుని వదిలేస్తారంటే, పైసలిచ్చి పదవులు కొనలేదని హరీష్ కౌంటర్ వేశారు.

హరీష్ రావు - రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం.. కౌంటర్ల మీద కౌంటర్లు
New Update

BRS v/s Congress : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా నడుస్తున్నాయి. బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తొమ్మిదేండ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి సభలో కొన్ని లెక్కలు వివరించి బీఆర్ఎస్ పదేండ్లలో పదిరేట్లకు పైగా అప్పులు చేసిందని విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపైనే చర్చ నడుస్తుండగా బుధవారం కాంగ్రెస్ మంత్రి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది. కేసీఆర్ హరీష్ రావునను బాగా వాడుకుంటున్నాడని రాజగోపాల్ ఆరోపించగా.. పైసలు పెట్టి పదువులు కొనుక్కోలేదని హరీష్ రావు కౌంటర్లు వేశారు.

ముందుగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మాటలు చెప్పడంలో కేసీఆర్‌ పోలికలన్నీ హరీష్ రావుకు వచ్చాయని, ఆయనలో మరో కేసీఆర్ కనిపిస్తున్నారన్నారు. అంతేకాదు బీఆర్ఎస్ కోసం హరీష్‌ ఎంత కష్టపడినా ఫలితం ఉండదని, పాపం హరీష్ రావును తండ్రీకొడుకులు బాగా వాడుకుంటారని సానుభూతిగా మాట్లాడారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన హరీష్‌రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. మీ పార్టీలాగా రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ కొనుక్కోలేదన్నారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొనగా తన వ్యాఖ్యల్ని హరీష్‌రావు వెనక్కి తీసుకోవాలని, వెనక్కి తీసుకోకపోతే హరీష్‌రావుని సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్ మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి : ఇల్లాలి ప్రాణం తీసిన ‘చాయ్’.. టైమ్ కు ఇవ్వలేదని అది కోసేసిన భర్త

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. దీనిపై వెంటనే స్పందించిన స్పీకర్ వెల్‌లోకి వచ్చి ఆందోళన చేయడం సరికాదన్నారు. ఇంతలోనే మళ్లీ మైక్ అందుకునన శ్రీధర్ బాడు అలాగే ఓడిపోయి నెల రోజులు కాలేదు అప్పుడే బెదిరింపులకు పాల్పడుతన్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ పోడియం దగ్గరకు వచ్చి ఆందోళన ఎలా చేస్తారని, ఇప్పటికే హరీష్‌ గంటా 50 నిమిషాలు మాట్లాడారని ఇక తనకు మైక్ ఇవ్వొద్దని స్పీకర్ ను కోరారు. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మేము పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నాం. మీరు రెండు రోజులు కూడా ఆగలేకపోతున్నారా. సభాపతిని బెదిరించడం సబబు కాదని బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. ఈ వివాదంలోకి ఎంటర్ అయిన బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. డిప్యూటీ సీఎం భట్టి స్పీకర్‌ని డిక్టేట్‌ చేయడం ఏమిటని ప్రశ్నించారు. హరీష్‌కు మరింత సమయం ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యుల పట్టు పట్టారు. స్పీకర్‌ వెల్‌ దగ్గరకు వచ్చి నినాదాలు చేయడంతో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనపై స్పీకర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే హరీష్‌రావు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగగా.. రాజగోపాల్‌రెడ్డి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటే తాను తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని హరీష్‌రావు తేల్చి చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని, కానీ తాము నాయకుడు ఏం చెబితే అది చేస్తామన్నారు. వాళ్లలా సీల్డ్‌ కవర్‌లో మాకు ఆదేశాలు రావు అంటూ ఎద్దేవా చేశారు. ఇంతలోనే కలగజేసుకున్న కోమటిరెడ్డి మీ బావ, బావమరది ఎలా కొట్టుకుంటారో నేను చెప్పాలా అంటూ మరోసారి సభలో వేడి రగిల్చేందుకు ప్రయత్నించారు. హరీష్‌రావు చేసిన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ ఆదేశం ఇచ్చారు.

#telangana #komati-reddy #assembly #harish-rao #rajagopal-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి