Israel-Iran : పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఎవరి బలం ఎంతంటే

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ ఇందుకు ప్రతీకారంగా ఇరాన్‌పై దాడి చేస్తే.. పశ్చిమాసియాలో యుద్ధం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే ఛాన్స్ ఉంది.

Israel-Iran : పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఎవరి బలం ఎంతంటే
New Update

West Asia : ఇజ్రాయెల్‌పై ఇరాన్(Israel-Iran) దాడి చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదివరకు ఈ రెండు దేశాలు ఒకదానిపై మరోటి దాడులు చేసుకోలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్షంగా దాడికి దిగింది. దీంతో ఇజ్రాయెల్ ఇందుకు ప్రతీకారంగా ఇరాన్‌పై దాడి చేస్తే.. పశ్చిమాసియాలో యుద్ధం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే ఛాన్స్ ఉంది. అయితే సైనిక బలంలో ఇరాన్ ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ 17వ స్థానంలో ఉంది. ఇరాన్ వద్ద పెద్ద సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు, సాయుధ డ్రోన్లు ఉన్నాయి. అంతేకాదు రష్యా(Russia) తో పాటు మరికొన్ని దేశాలకు ఇరాన్ సాయుధ డ్రోన్లను ఎగుమతి చేస్తోంది.

Also Read: భారత్‌లో 2 లక్షల అకౌంట్లపై నిషేధం.. కారణం ఇదే

3 వేల కి.మీ ప్రయాణస్తాయి

ఇరాన్‌ వద్ద దాదాపు మూడు వేల వరకు క్షిపణులు ఉన్నాయి. వాటిలో కొన్ని కేవలం 12 నిమిషాల్లోనే ఇజ్రాయెల్‌ను చేరుకోగలవు. ఇక క్రూజ్‌ క్షిపణులకు 2 గంటలు, డ్రోన్లకు 9 గంటల సమయం పడుతుంది. ధ్వనికన్నా 5 రేట్లు వేగంగా దూసుకెళ్లే హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణులు కూడా ఇరాన్ వద్ద ఉన్నాయి. అలాగే KH-55 అనే క్రూజ్‌ క్షిపణులు కూడా ఇరాన్ వద్ద ఉన్నాయి. గగనతలం నుంచి వీటిని ప్రయోగిస్తారు. అంతేకాదు ఇవి అణు వార్‌హెడ్‌ను కూడా మోసుకెళ్లగలదు. దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరం వరకు ఇవి ప్రయాణిస్తాయి

 ప్రత్యర్థిని తిప్పికొట్టగల ఇజ్రాయెల్

ఇక ఇజ్రాయెల్‌ విషయంలో చూసుకుంటే.. గగనతల రక్షణలో ఇది ఒక తిరుగులేని శక్తిగా అవతరించింది. ఇజ్రాయెల్ దగ్గర ప్రత్యర్థి క్షిపణులను గాల్లోనే పేల్చగలిగే ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ దేశానికి భారీగానే సాయుధ డ్రోన్లు ఉన్నాయి. జనాభా, విస్తీర్ణంపరంగా చూసుకుంటే ఇజ్రాయెల్‌ కన్నా ఇరాన్ చాలా పెద్దది. ఇరాన్‌ వద్ద ఎక్కువ సంఖ్యలో ఆయుధ సంపత్తి ఉంది. అయితే వాటిలో చాలావరకు కాలం చెల్లినవే ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర మాత్రం అధునాతన ఆయుధ సంపత్తి ఉంది. అలాగే ప్రత్యర్థి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఈ దేశ రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది.

Also Read: నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

ఇజ్రాయెల్ దాడి చేస్తుందా ?

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే.. మేము మరింత తీవ్రంగా స్పందించామని ఇప్పటికే ఇరాన్ హెచ్చరిచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా కూడా ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడికి దిగితే తాము ఆయుధపరంగా సాయం చేయమని ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్‌ వార్ కేబినెట్ అధికారులు మాత్రం అమెరికా(America) సాయం లేకున్నా ఇరాన్‌పై దాడి చేయాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఇజ్రాయెల్.. తాము ఇరాన్‌పై దాడి చేస్తామని అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడులు చేస్తే.. పరిస్థితులు మరింత అధ్వానంగా మారుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#telugu-news #usa #israel-attack #israel-iran #iran-attack
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe