Election Polling : నేడు లోక్‌సభ(Lok Sabha) మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 93 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్‌గఢ్, కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 1352 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 17.24 కోట్ల మంది ఓటర్లు(Voters) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం(Election Commission) 1.85 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఓటుహక్కును అందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని.. ఎన్నికల సంఘం ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసెజ్‌లు పంపుతోంది.
Also read: కేజ్రీవాల్‌కు మరో షాక్.. NIA విచారణకు ఆదేశం
ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) గుజరాత్‌లోని గాంధీనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో అమిత్ షాతో పాటు ప్రధాని మోదీ(PM Modi) గుజరాత్‌కి చేరుకున్నారు. ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు మూడో విడత పోలింగ్ రోజు సాధారణ వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వడగాల్పుల ప్రభావం తట్టుకునేందుకు ఎన్నికల సంఘం.. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, నీళ్లు, ఓఆర్‌ఎస్‌లను ఏర్పాటు చేసింది. ఎన్నికలను ప్రత్యక్షంగా చూసేందుకు 23 దేశాల ప్రతినిధులను ఈసీ ఆహ్వానించింది.
ఇక నేటితో మూడో విడత పోలింగ్ ముగియనుంది. ఇంకా నాలుగు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న నాలుగో విడతలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న ఏడో విడతతో ఎన్నికలు ముగుస్తాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే ఈసారి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Also Read: క్రికెట్ బాల్ ప్రైవేట్ పార్ట్‌కు తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి