AP Crime: విశాఖ ఆర్కే బీచ్‌లో అంతులేని విషాదం.. కళ్లముందే విద్యార్ధుల గల్లంతు

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం బీచ్‌కు వచ్చిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇద్దరిలో హర్ష అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

New Update
AP Crime: విశాఖ ఆర్కే బీచ్‌లో అంతులేని విషాదం.. కళ్లముందే విద్యార్ధుల గల్లంతు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం బీచ్‌కు వచ్చిన ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. సముద్ర తీరాన ఈత కొడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది రంగంలోకి దిగారు. అక్కడికి చేరుకున్న వారు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. గల్లంతైన విద్యార్థులలో ఒకరిని కోన ఊపిరితో ఉన్న స్థితిలో సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చారు. వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే.. అక్కడ చికిత్స పొందుతూ హర్ష మరణించాడు. మరో విద్యార్థి రాజ్‌కుమార్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఇద్దరు విద్యార్థులు కూడా ఎన్నారై కాలేజ్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హర్ష, రాజ్ కుమార్ అనే ఇంటర్ విద్యార్థులు ఉదయం ఆర్‌కె బీచ్‌కు వచ్చారు. వారు బీచ్‌లో ఈతకొడుతుండగా సముద్రపు అలలకు కొట్టుకపోయారని పోలీపులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రంలో నుంచి హర్ష మృతదేహాన్ని బయటకు తీయగా రాజ్‌కుమార్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అనంతరం పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అలలు ఎగసిపడుతున్న సమయంలో సముద్రం లోపలికి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో విద్యార్థి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసింది. దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చి సాయి మృతి చెందిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లిలో కలకలం రేపింది. అయితే విద్యార్థులు గోదావరి నదిలోకి వెళ్ళొద్దని సాయి తండ్రి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసింది. సరదాగా ఈత కోసం వెళ్లి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటినుంచి అయినా విద్యార్థులు సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం.

ఇది కూడా చదవండి: కుప్పంను బెంబేలెత్తిస్తున్న చెడ్డీగ్యాంగ్.. హడలిపోతున్న నగర వాసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు