IPL-2024 : ఒకే ఒక్కడు.. అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్న కోహ్లీ

కింగ్ కోహ్లీ కెరియర్‌లో సాధించని రికార్డ్ లేదు. ఎంతో మందిని అధిగమిస్తూ దూసుకుపోతున్న విరాట్ ఇప్పుడు చరిత్రలో ఒక్కడుగా కూడా నిలిచిపోయాడు. ఇప్పటివరకు ఎవ్వరికీ లేని అరుదైన ఘనతను సాధించన మొదటి వ్యక్తిగా అవతరించాడు.

IPL-2024 : ఒకే ఒక్కడు.. అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్న కోహ్లీ
New Update

Virat Kohli : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఒకే వేదిక మీద వంద టీ20 మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి భారత క్రికెటర్‌(Indian Cricketer) గా రికార్డులకెక్కాడు. నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌(LSJ) తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ 16 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లను రాయల్స్ ఛాలెంజర్స్ ఓడిపోయారు. ఈ సీజన్‌లో వీళ్ళకు ఇది వరుసగా రెండో ఓటమి. ఇక ఒకే వేదిక మీద ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన వారి జాబితాలో విరాట్ తర్వాత రోహిత్ శర్మ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో 80 మ్యాచ్‌లు, ఎంఎస్ ధోనీ చెపాక్‌ మైదానంలో 69 మ్యాచులు ఆడారు.

లక్నో చేతిలో ఓడిపోయిన బెంగళూరు...

ఇక నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆర్సీబీ మొదట బౌలింగ్ చేసింది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 20 ఓవర్లోల 181 పరుగులు చేసింది. ఇందులో డికాక్ 56 బంతుల్లో 81 పరుగులు, నికొలస్ పూరన్ 21 బంతుల్లో 40 పరుగులు చేసి భారీ స్కోర్ రావడానికి కారణమయ్యారు. తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ మొదట్లో కాస్త బాగానే ఆడినా తరువాత మాత్రం నిలుదొక్కుకోలేకపోయింది. విరాట్ 16 బంతుల్లో 22, డుప్లెసిస్ 19, జరిత్ పాటేదార్ 29 పరుగులు చేసి కాసేపు క్రీజులో ఉన్నారు. కానీ యువ పేసర్ మయాంక్ ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు కుప్పకూలిపోయారు. మాక్స్వెల్ డకౌట్ అవగా, కామెరా గ్రీన్ 9 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో ఆర్సీబీ 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Also Read : Chhattisgarh : దద్దరిల్లుతున్న దండకారణ్యం..నాలుగు రోజుల్లో రెండు ఎన్‌కౌంటర్లు

#virat-kohli #ipl-2024 #bengaluru #lucknow-super-giants #rcb
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి