ఫ్రెండ్ మాట విని మర్మాంగం కోసుకున్న యువకుడు.. తర్వాత లబోదిబో మంటూ..

ఓ యువకుడు వైద్యులను సంప్రతించకుండా తెలిసిన వ్యక్తి ఇచ్చిన సలహాను పాటించాడు. అతడు ఇచ్చిన సలహా మేరకు తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రిపాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌‌లోని ప్రయాగ్‌రాజ్‌ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
crime

పక్క వ్యక్తి చెప్పిన మాటలు విని ఓ యువకుడు ఆగమైయ్యాడు. నువ్వు మగవాడిగా జన్మించాడు. కానీ నీకు అన్నీ అమ్మాయిల ఫీలింగ్స్‌ ఉన్నాయని ఓ వ్యక్తి అతని స్నేహితుడితో చెప్పాడు. దాంతో అతడు అమ్మాయిగా మారాలని నిర్ణయించుకున్నాడు. దానికి ఆ యువకుడు వైద్యులను సంప్రతించకుండా తెలిసిన వ్యక్తి ఇచ్చిన సలహాను పాటించాడు. అతడు ఇచ్చిన సలహా మేరకు తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రిపాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌‌లోని ప్రయాగ్‌రాజ్‌ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు పోటీపరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే అతడికి అమ్మాయిల ఫీలింగ్స్‌ ఉండటంతో అమ్మాయిగా మారాలని భావించాడు. ఇదే విషయాన్ని తనకు తెలిసిన వ్యక్తి దగ్గర ప్రస్తావించడంతో.. అతడు మత్తు ఇంజక్షన్ తీసుకుని మర్మాంగాన్ని కోసుకోమని సలహా చెప్పాడు. అతడు చెప్పినట్లుగా యువకుడు మత్తు ఇంజక్షన్ తీసుకుని మర్మాంగాన్ని కోసుకున్నాడు. మత్తు ప్రభావంలో ముందుగా నొప్పి తెలియకపోయినా క్రమంగా మత్తుదిగినాకొద్ది నొప్పి మొదలైంది. దీంతోపాటు తీవ్ర రక్తస్రావమైంది. నొప్పి భరించలేక ఇరుగుపొరుగుకు విషయం చెప్పాడు. దాంతో వారు హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు అతడికి చికిత్స చేశారు. రక్తస్రావం ఆగిపోయిందని అతడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు