Viral Video: అయ్యో ! పెళ్లి జరుగుతుండగానే.. ఊహించని ఘటన (వీడియో వైరల్)

పెళ్లి మండపంలో అతిథులు నిల్చున్న పై కప్పు కూలిపడడం నెట్టింట వైరల్ అవుతోంది. మరి కాసేపట్లో మూహూర్తం అనగా.. మండపం పక్క భాగంలోని పై కప్పు కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

New Update
viral video at wedding

viral video at wedding

Viral Video:   వధూవరులు ఇద్దరూ పెళ్లి పీటలపై కూర్చున్నారు.. మరో కొద్ది కాసేపట్లో ముహూర్తం ..ఇంతలో పెళ్లి మండపంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పెళ్లి మండపం  కూలిపోయింది! ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read: HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?

పెళ్లిలో కూలిన పై కప్పు 

అయితే ఓ ఇంటి భవనం పై ఉన్న మేడ పై వివాహం జరుగుతోంది. మరికొద్ది ముహూర్తం ఉండడంతో అతిథులంతా అక్కడే నిల్చొని పెళ్లి వేడుకను చూస్తున్నారు. ఇంతలో అతిథులంతా నిల్చున్న పైకప్పు ఒక్కసారిగా కుప్ప కూలింది. దీంతో అక్కడ నిల్చున్న వారంతా కింద పడిపోయారు.  అయితే ఎత్తు తక్కువగా ఉండడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అలాగే వధూవరులు కూర్చున్న ప్రదేశం కూడా సురక్షితంగా ఉంది. ప్రస్తుతం భవనం నిర్మాణ దశలో ఉండడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

Also Read: Viral Video: స్టేజ్ పైనే జారిపోయిన సింగర్ ప్యాంట్.. కానీ, భలే కవర్ చేసింది! వీడియో వైరల్

సందడిగా జరుగుతున్న పెళ్ళిలో ఇలా జరగడంతో అంతా షాకయ్యారు. కానీ ఎలాంటి ప్రాణహానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అంతేకాదు ఈ వీడియోకు ఇప్పటికే 97 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 

Also Read: Gopichand33 Glimpse: గోపిచంద్‌ బర్త్‌డే స్పెషల్‌.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు