Bull Riding Scooty: అలా ఎలా ఎక్కిందమ్మా.. స్కూటీ నడిపిన ఎద్దు (VIDEO) వైరల్

ఎద్దు స్కూటర్‌పై వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో రోడ్డు పక్కన ఆపి ఉన్న స్కూటీపై ఎద్దు రెండు కాళ్లతో ఎక్కి ప్రయాణించింది. అది అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డైంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

New Update
Bull Riding Scooty

యువకులు స్కూటీపై స్టంట్ చేస్తూ వీధుల్లో తిరగడం మీరు చూసి ఉంటారు. కానీ ఓ ఎద్దు వీధుల్లో స్కూటర్ నడపడం చూశారా..? అవును మీరు విన్నది నిజమే.. అది యానిమేషన్ కాదు, ఎడిటింగ్ అంతకంటే కాదు. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఎద్దులు కూడా స్కూటీలను ఇష్టపడుతున్నాయి. అక్కడ అవి కూడా స్కూటర్ నడుపుతున్నాయి. ఈ సంఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఎద్దు స్కూటీపై వెళ్లే వీడియో తెగ వైరల్ అవుతుంది. అది చూసున వారంతా షాక్ అవుతున్నారు. మరి కొందమంది నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇంకొందరు స్కూటీని ఎద్దు దొంగలించాలనుకుందని ఆ వీడియోకి కామెంట్ చేస్తున్నారు. 

Also read: లవర్‌తో ఆ పని చేస్తూ తల్లిదండ్రులకు పట్టుబడ్డ కన్నకొడుకు.. పాపం అందరి ముందు(VIRAL VIDEO)

రిషికేశ్‌లోని గుమానీ వాలా సమీపంలో వింత ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఓ తెల్లని స్కూటీ పార్క్ చేశారు. అటుగా వెళ్తున్న ఓ ఎద్దు అకస్మాత్తుగా తన రెండు కాళ్లుతో స్కూటీపై ఎక్కింది. అలా కొంతదూరం స్కూటీ రోడ్డుపై వెళ్లింది. తర్వాత అది ఓ ఫ్లాట్ ఫామ్‌ను ఢీకొని కిందపడిపోయింది. అక్కడే కొంత దూరంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్. స్కూటర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొని ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. చాలా కాలంగా ఆవులు, ఎద్దులు వీధుల్లో తిరుగుతూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని అక్కడి ప్రజలు వాపోతున్నారు. వాటిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే విచ్చలవిడి తిరిగే జంతువులు సిటీలో రోడ్డు ప్రమాదాల ప్రమాదాలను పెంచుతాయి.

(bull riding scooty | viral-video | scooty | latest-telugu-news | telugu viral videos)

Advertisment
తాజా కథనాలు