Turkey: పెళ్లికి బాస్ లీవ్ ఇవ్వకపోవడంతో.. ఆప్షన్ లేక ఏం చేశారంటే? టర్కీలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తికి బాస్ లీవ్ ఇవ్వకపోవడంతో వర్చువల్‌గా వివాహం చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న వధువు తన తాత చివరి కోరిక మేరకు వివాహం చేసుకోవాలనుకున్న.. బాస్ సెలవు ఇవ్వకపోవడంతో వీడియో కాల్ ద్వారా వివాహం చేసుకున్నారు. By Kusuma 09 Nov 2024 in వైరల్ Latest News In Telugu New Update షేర్ చేయండి పెళ్లి అనే పవిత్ర బంధం జీవితాంతం గుర్తుండిపోవాలని ఘనంగా చేసుకుంటారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పచ్చని పందిరిలో సంతోషంగా పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు. అయితే ఇటీవల ఓ జంట వీడియో కాల్‌లో పెళ్లి చేసుకున్న ఘటన నెట్టింట్ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన ఓ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది కూడా చూడండి: Amla: కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం! మనవరాలు వివాహం చూడాలనే తాత కోరిక మేరకు.. వధువు తాతకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో అతని చివరి కోరిక మేరకు వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అయితే వధువు ఇండియాలోనే ఉండగా.. వరుడు మాత్రం ఉద్యోగ రీత్యా టర్కీలో ఉన్నాడు. పెళ్లి కోసం వరుడు ఆఫీస్‌లో సెలవు అడిగితే మేనేజర్ ఇవ్వలేదు. దీంతో ఆప్షన్ లేకపోవడంతో వీడియో కాల్‌లో పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. బాస్ లీవ్ ఇవ్వకపోవడంతో వీడియో కాల్ ద్వారా జంట ఒక్కటయ్యారు. ఇది కూడా చూడండి: Green Tea: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? ముస్లిం పద్ధతిలో కొత్త జంట ఒక్కటయ్యారు. వీడియో కాల్‌లో మూడుసార్లు ఖబూల్ హై అనిపించారు. ముస్లిం పద్ధతిలో ఇలా మూడుసార్లు అంటే వివాహం జరిగిపోయినట్లేనని భావిస్తారు. పెళ్లయిన తర్వాత ఊరేగింపును కూడా ఇరు కుటుంబాలు నిర్వహించారు. బాస్ లీవ్ ఇవ్వలేదని వీడియో కాల్‌లో వివాహం చేసుకోవడంతో ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ఇది కూడా చూడండి: తొలి టీ20లో భారత్ విజయం.. అదరగొట్టిన శాంసన్ ఇదిలా ఉండగా.. గతేడాది జూలైలో సిమ్లాలోని కోట్‌ఘర్‌కు చెందిన ఆశిష్ సింఘా, కులులోని భుంతర్‌కు చెందిన శివాని ఠాకూర్ కూడా వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం వల్ల ఆకస్మిక వరదల వచ్చాయి. దీంతో పెళ్లికి వెళ్లలేకపోవడంతో వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా చూడండి: ఇక్కడ చేసిన ఫుడ్ తిన్నారో.. ఒక్కసారికే పైకి పోవడం గ్యారెంటీ! #virtual-marriage #turkey #video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి