లగ్జరీ కారులో వచ్చి చీప్ దొంగతనం | Young Woman Stole A Flower Pot Noida, Uttar Pradesh | RTV
ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించి ఓ మాంత్రికుడు రేష్మా బెహరా అనే యువతి తలకు 70 సూదులు గుచ్చిన ఘటన ఒడిశాలో జరిగింది. గంటన్నరపాటు శ్రమించి ఆమె తలలోని సూదులను వైద్యులు బయటికి తీశారు. మాంత్రికుడు తేజ్రాజ్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన బస్ కండక్టర్ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.ఫరూఖ్ నగర్ డిపోకు చెందిన బస్సులో పుప్పాలగూడ నుంచి హియాయత్ నగర్ కు ప్రయాణిస్తున్న ఓ యువతితో బస్సు కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు.
నాగరాజు అనే యువకుడు తనను ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా అనుభవించి మోసం చేశాడని ఏపీలోని ముమ్మిడివరంలో ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. ప్రియుడితోనే తనకు వివాహం చేయాలంటూ కాట్రేనికోన తహశీల్దారు కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టింది.
ఓ యువకుడి చేతిలో మరో యువతి బలైంది. పంజాబ్ మొహాలికి చెందిన అమ్మాయి ఆఫీసుకు వెళ్తున్న సమయంలో నడి రోడ్డుపై పబ్లిక్ ముందే ఓ వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. తీవ్ర గాయలైన ఆమె అక్కడికక్కడే మరణించింది. వీడియో వైరల్ అవుతోంది.
సినిమా పిచ్చితో ఓ యువతి దారుణంగా మోసపోయింది. సంతోశ్ అనే వ్యక్తి హీరోయిన్ గా అవకాశం ఇప్పిస్తానని శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు తీసినట్లు తెలిపింది. బెంగళూర్ లో నిందితుడిపై కేసు నమోదైంది.
అంబటి కీర్తినాయుడు అనే ఏపీ యువతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ధవళేశ్వరంకు చెందిన ఆమె కస్టమ్స్, ఎంటీఎస్, రైల్వే, పోస్టల్, గ్రామ కార్యదర్శి, ట్యాక్స్ అసిస్టెంట్, జీఎస్టీ ఇన్స్పెక్టర్ జాబ్స్ సాధించినా సివిల్స్ లక్ష్యం అంటోంది.