US: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్నిరోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ట్రంప్ ఆ బాధ్యతలు చేపట్టకముందే తాను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తానని క్రిస్టోఫర్ రే పేర్కొన్నారు. ట్రంప్ తన కార్యవర్గంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ గా కశ్యప్ పటేల్ ను ఎంపిక చేసిన కొన్ని రోజుల తర్వాత రే ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
Also Read: మంచు ఫ్యామిలీలో వివాదాలకు హీరోయిన్ సౌందర్యతో లింక్.. ఈ మేటర్ తెలుసుకుంటే షాక్!
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన పూర్తయ్యేవరకు నేను ఎఫ్‌బీఐ డైరెక్టర్ గా బ్యూరోకు సేవ అందిస్తాను. ఆపై పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించున్నా.ఇది నాకు అంత సులువైన విషయం కాదు. నేను నా పనిని ప్రజలను ఎంతో ప్రేమిస్తాను. ఈ విషయం బహిరంగంగా ప్రకటించడానికి ముందే ఈ విషయం తెలియడం ముఖ్యం అంటూ క్రిస్టోఫర్ తన సహోద్యోగులతో పేర్కొన్నట్లు సమాచారం.
Also Read: TG Crime: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు కుటుంబం బలి
మరో వైపు క్రిస్టోఫర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.క్రిస్టోఫర్ రే రాజీనామా అమెరికా కు గొప్ప రోజు. ఆయన నాయకత్వంలోని ఎఫ్‌బీఐ ఎలాంటి కారణం లేకుండానే నా ఇంట్లో సోరదాలు చేశారు.వారు అధికారాన్ని ఉపయోగించి అనేక మంది అమాయకులైన అమెరికన్‌ప్రజలను బెదిరించారు. వారిలో కొందరు ఎప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నారు.
Also Read: AP Crime: కూతురు ఫోన్.. కువైట్ నుంచి వచ్చి చంపిన తండ్రి
అందరికీ తెలిసినట్లు ఎఫ్‌బీఐపై నాకు ఎంతో గౌరవం ఉంది.అమెరికన్ ప్రజలు న్యాయపరమైన వ్యవస్థను డిమాండ్ చేస్తున్నారు. అటువంటి దాని కోసం మేము ఎదురు చూస్తున్నాం.అది కశ్యప్ పటేల్‌తోనే సాధ్యమవుతుందంటూ ట్రూత్ లో రాసుకొచ్చారు. రే ఎఫ్‌బీఐ డైరెక్టర్ గా ఏడేళ్ల పాటు చిత్త శుద్దితో సేవలందించాలని అటార్నీ జనరల్ మెరిక్ బి గార్లాండ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎఫ్‌బీఐలోని అధికారులకు గార్లాండ్ కృతజ్ఙతలు తెలియజేశారు.
Also Read: Sabarimala: శబరిమలకు మరో 26 అదనపు రైళ్లు..!