BIT Coin: 24 గంటల్లో 3.82 లక్షల ప్రాఫిట్ క్రిప్టోమార్కెట్లు నిన్న జోరు ప్రదర్శించాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడుల వర్షం కురిపించారు. గత 24 గంటల్లో బిట్ కాయిన్ 4500 డాలర్లు లాభపడింది. అంటే రూ.3.82 లక్షలు అనమాట. మళ్లీ 1,01,125 డాలర్ల వద్ద ముగిసింది. By Bhavana 12 Dec 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి క్రిప్టోమార్కెట్లు నిన్న జోరు ప్రదర్శించాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడుల వర్షం కురిపించారు. గత 24 గంటల్లో బిట్ కాయిన్ 4500 డాలర్లు లాభపడింది. అంటే రూ.3.82 లక్షలు అనమాట. మళ్లీ 1,01,125 డాలర్ల వద్ద ముగిసింది. నేడు మాత్రం 450 డాలర్లు నష్టంతో 1,00,676 వద్ద ట్రేడవుతోంది. Also Read: Breaking: ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి మార్కెట్ విలువ 2.02 డాలర్లను టచ్ చేసింది. ఇక డామినెన్స్ 55 శాతంగా ఉంది. గత 24 గంటల్లో ఈటీహెచ్ 6, ఎక్స్‌ఆర్పీ 5,ఎస్‌ఓఎల్ 6, బీఎన్‌బీ 7, డీఓజీఈ 8, ఏడీఏ10, టీఆర్‌ఓఎన్ 7,ఏవీఏఎక్స్ 12,ఎస్‌హెచ్‌ఐబీ 9శాతం మేర పెరగడంవిశేషం. Also Read: Allu Arjun: రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. PKతో రహస్య భేటీ! క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ విలువ ఏకంగా 1,00,000 డాలర్లను దాటేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో కొన్నాళ్లుగా ఇది భారీగా ర్యాలీ చేస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగు వారాల్లోనే దీని విలువ 45 శాతం పెరిగిందంటే దీని దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. Also Read: Grandhi Srinivas: ఒకేరోజు జగన్‌కు మూడు బిగ్ షాకులు! క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలను సడలిస్తానని ట్రంప్ సంకేతాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఇది 1,00,000 డాలర్ల మార్కును దాటేసింది. ఒక దశలో అత్యధికంగా 1,00,512 ను తాకింది. మడ్‌రెక్స్ సీఈవో ఈ పరిణామాల పై స్పందిస్తూ బిట్ కాయిన్ వెనక మస్క్ కు డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ సామర్థ్యం కట్టబెట్టడం వంటి కారణాలు ఉన్నాయి. Also Read: Loan App Harassment: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు కుటుంబం బలి దీంతోపాటు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజీ కమిషన్ చైర్మన్ గా పాల్ అట్కిన్ కు ట్రంప్ బాధ్యతలు అప్పగించడం వంటివి కలిసొచ్చాయి. దీంతో క్రిప్టో అనుకూల పాలసీలు వస్తాయన్న అంచనాలు బలపడ్డాయి. భవిష్యత్తులో బిట్‌కాయిన్ 1,20,000 డాలర్లకు కూడా చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతంలో పాల్ అట్కిన్ గతంలో జార్ డబ్ల్యూ బుష్ హయాంలో కూడా ఎస్‌ఈసీ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత పదవిని వీడాక అమెరికాలో మార్కెట్ నియంత్రణ చాలా తీవ్రంగా ఉందని న్యాయపోరాటం చేశారు. తాజాగా మళ్లీ ఆయనకే ట్రంప్ ఎస్‌ఈసీ పగ్గాలు అప్పజెప్పడం విశేషం. అమెరికా ఎన్నికల రోజున బిట్ కాయిన్ విలువ 69,374 డాలర్లుగా ఉంది.రెండేళ్ల క్రితం 17,000 డాలర్ల దిగువకు జారిపోయిన ఈ క్రిప్టో కరెన్సీ ఇప్పుడు లక్ష డాలర్లను దాటేయడం విశేషం. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి