‘మహాత్మ గాంధీ జీ’ పేరుతో బీర్ బాటిల్.. ఫుల్ ఫైర్ అవుతున్న నెటిజన్లు

రష్యాలో బీర్ కంపెనీ మహాత్మ గాంధీ పేరుతో బీర్లు అమ్ముతోంది. బీర్ బాటిళ్లపై మహత్మా జీ అని రాసి ఆయన ఫొటోని కూడా వేసింది రివర్ట్ బీర్ కంపెనీ. ఆ ఫొటోలపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. గాంధేయవాదులు వాటిని తీసేయాలని కామెంట్ మండిపడుతున్నారు.

author-image
By K Mohan
New Update
beer in mahathma gandhi

beer in mahathma gandhi Photograph: (beer in mahathma gandhi)

ఇండియాలో గాంధీ జయంతి, వర్థంతి నాడు పూర్తిగా మద్యపానం నిషేదం విధిస్తారు. అలాంటిది గాంధీ తాత ఫొటో వేసే ఆయన పేరు ఓ బీరు కంపెనీ మద్యాన్ని అమ్ముతోంది. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ మహాత్మ గాంధీకి అవమానం. మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ శాఖాహారి, మద్యం ముట్టడు. భారతీయ జాతిపితగా పిలుచుకునే మహత్మ గాంధీ ఫొటో రష్యాలో బీర్ కంపెనీ బాటిల్‌పై వేసి అమ్ముతున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read:  Spirit Casting Call: ఇదెక్కడి క్రేజ్.. ప్రభాస్ తో నటించేందుకు మంచు విష్ణు అప్లికేషన్

రష్యాకు చెందిన రివర్ట్ బీర్ డబ్బాలపై మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించింది. అంతేకాదు దాని మీద మహాత్మ అని కూడా రాసి ఉంది. దీంతో ప్రస్తుతం ఆ కంపెనీ విమర్శలకు గురవుతుంది. మహాత్మ గాంధీని చాలా దేశాలు గౌరవిస్తాయి. 

రష్యన్ బ్రాండ్ రివర్ట్ తయారు చేసిన ఈ బీర్ల డబ్బాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదంగా చెలరేగింది. రాజకీయ నాయకుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందిని సత్పతి మనవడు సుపర్ణో సత్పతి ఈ ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేశారు. భారత అధికారులు ఈ విషయంలో రష్యాని సంప్రదించాలని కోరారు. మహాత్మ గాంధీ ఫొటోలు ఉన్న బీర్ బాటిళ్ల ఫొటోలు షేర్ చేస్తూ ఇండియా ప్రధాని నరేంద్ర మోదీని మెన్షన్ చేశారు. దీనిపై మీ ఫ్రెండ్ రష్యా అధ్యక్షుడితో చర్చించాలని అభర్థించారు. రష్యాకు చెందిన రివర్ట్ గాంధీ జీ పేరుతో బీరు అమ్ముతున్నట్లు తేలిందిని సత్పతి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై భారతీయులు ఫైర్ అవుతున్నారు. ఇలా చేయడం తప్పని మండిపడుతున్నారు. గాందేయవాదులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

Also Read: Maha Kumbh Mela: మహా కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్ సంచలన ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు