Spirit Casting Call: ఇదెక్కడి క్రేజ్.. ప్రభాస్ తో నటించేందుకు మంచు విష్ణు అప్లికేషన్

'స్పిరిట్' మూవీలో నటీనటుల కోసం డైరెక్టర్ సందీప్ ఆడిషన్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆడిషన్ కి హీరో మంచు విష్ణు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ప్ర‌భాస్ ‘స్పిరిట్‌’ కాస్టింగ్ కాల్‌కి నేనూ అప్ల‌య్ చేశాను. ఏం జరుగుతుందో చూడాలి అంటూ ట్వీట్ చేశారు.

New Update
Prabhas spirit

Prabhas spirit

Spirit Casting Call:  సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  'స్పిరిట్'.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈమూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ కొత్త నటీనటులకు  సినిమాలో నటించే అవకాశం కలిపిస్తూ కాస్టింగ్‌ కాల్‌ ప్రకటన చేశారు. ఆసక్తి ఉన్న వారు తమ ఫోటోలు, వీడియోలను సంబంధిత మెయిల్ ఐడీకి పంపించాలని తెలిపారు. ఆడిష‌న్స్‌లో పాల్గోనేవారు సినిమా లేదా థియేట‌ర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారు అయి ఉండాలని పేర్కొన్నారు.

Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశివారు  ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్‌!

 మంచు విష్ణు అప్లికేషన్ 

ఈ నేపథ్యంలో తాజాగా హీరో మంచు విష్ణు తాను కూడా ఈ ఆడిషన్ కి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ప్ర‌భాస్ ‘స్పిరిట్‌’ కాస్టింగ్ కాల్‌కి నేనూ అప్ల‌య్ చేశాను. ఏం జరుగుతుందో చూడాలి అంటూ ట్వీట్ చేశారు. మరి సందీప్ రెడ్డి వంగా మంచు విష్ణు ని సెలెక్ట్ చేస్తారా?  లేదా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. 


డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ఈమూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  దాదాపు రూ. 300 వందల కోట్లతో రూపొందుతున్న  'స్పిరిట్' సందీప్ సొంతం బ్యానర్ భద్రకాళి సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. 

Also Read: Maha Kumbh Mela: మహా కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్ సంచలన ప్రకటన

#Manchu Vishnu #telugu-news #spirit-movie #Prabhas Spirit Casting Call #latest-news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు