Maha Kumbh Mela: మహా కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్ సంచలన ప్రకటన

మహా కుంభమేళాకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్‌ తెలిపింది.

New Update
Maha Kumbhmela 2025

Maha Kumbhmela 2025


యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్‌ తెలిపింది. మానవ చరిత్రలో ఇప్పటిదాకా ఏ మతపరమైన లేదా సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఇంతటి స్థాయిలో జనం రాలేదని వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 92 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు పేర్కొంది.  

Also Read: పంజాబ్‌కే అక్రమ వలసదారులను అమెరికా ఎందుకు పంపిస్తోంది ?

భారత్‌, చైనా తప్ప మిగతా దేశాల జనాభాను కుంభమేళాకు వచ్చిన వారి సంఖ్య దాటేసిందని తెలిపింది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచిరించిన వాళ్లు పాకిస్థాన్, బంగ్లాదేశ్, బ్రెజిల్‌, ఇండోనేషియాతో పాటు రష్యా, అమెరికా దేశాల జనాభా కన్నా ఎక్కువ అని పేర్కొంది. ఇదిలాఉండగా 144 ఏళ్లకొకసారి నిర్వహించే ఈ మహా కుంభమేళా జనవరి 13న మొదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. 

Also Read: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?

ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది వరకు రావొచ్చని ముందుగా యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ దీనికి మించి ఊహించని స్థాయిలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వస్తున్నారు. ఇప్పటికే 50 కోట్లు దాటేసింది. కుంభమేళా అయిపోయే నాటికి ఈ సంఖ్య మరిన్ని కోట్లు పెరగుతుంది. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం చెప్పింది. ఆరోజున తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో  30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

Also read: మోదీ బీసీ కాదు.. కేసీఆర్‌కు తెలంగాణలో ఉండే హక్కు లేదు: రేవంత్ సంచలనం!

Also Read: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!

Advertisment