/rtv/media/media_files/2025/07/06/bihar-viral-news-2025-07-06-21-46-51.jpg)
బీహార్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. విద్యార్థిపై చేయి చేసుకున్న ఓ టీచర్‌పై బాలుడి తల్లిదండ్రులు కర్రలతో దాడి చేశారు. ఇతర టీచర్లు వారిస్తున్నా వినకుండా రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గయ జిల్లాలో ఈ ఘటన జరిగింది. క్లాసులో ఐదవ తరగతి విద్యార్థులు ఇద్దరు గొడవ పడుతున్న విషయాన్ని రాకేశ్ రంజన్ శ్రీవాత్సవ అనే టీచర్‌కు మరో విద్యార్థి ఫిర్యాదు చేశాడు. దీంతో హుటాహుటిన క్లాసులోకి వచ్చిన రాకేశ్ విద్యార్థుల కొట్టాడు. దీంతో గొడవ ముగిసిపోయినప్పటికీ ఓ విద్యార్థి ఇంటికెళ్లి టీచర్ తనను కొట్టిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు.
ये क्या है,आखिर सरकारी कर्मी कब तक असुरक्षित रहेंगे?@bihar_police संज्ञान लें👇
— Teacher Info Point (@Teacher_Point) July 6, 2025
घटना गयाजी जिले के म० वि० शहवाजपुर खिजरसराय प्रखंड की है जहाँ एक छोटी सी बात के लिए परिजन टीचर को मारने-पीटने लगे। शिक्षक ने अपने स्कूल के बच्चों को होमवर्क ना करने पर सिर्फ सामान्य रूप में डाँटा था। pic.twitter.com/2pdXGqMpne
ఆగ్రహంతో ఊగిపోయిన బాలుడి తల్లిదండ్రులు స్కూలుకు వచ్చి రచ్చ రచ్చ చేశారు. క్లాసులు జరుగుతుండగానే తమ కొడుకుపై చేయి చేసుకున్న రాకేశ్ పై దాడికి దిగారు. వెంట పడి కర్రతో దాడి చేశారు. పేరెంట్స్ దాడిలో రాకేశ్‌తో పాటు మరో టీచర్ ధర్మేంద్ర కుమార్‌కు కూడా గాయాలయ్యాయి. ఇక విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధిత టీచర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.