Helicopter Crash: హెలికాఫ్టర్ క్రాషై కుటుంబ సభ్యులు మొత్తం మృతి

అమెరికాలోని న్యూయార్క్ హడ్సన్ నదిలో హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈప్రమాదంలో పైలట్‌తోపాటు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. అందులో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ల్యాండింగ్ టైంలో వాతావరణం అనుకూలించక హెలికాఫ్టర్ నదిలో పడిపోయింది.

New Update
Helicopter Crash

Helicopter Crash

ముగ్గురు పిల్లలతోపాటు మరో ముగ్గురు హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఈ దుర్ఘటన న్యూయార్క్‌లోని హడ్సన్ నది దగ్గర గురువారం చోటుచేసుకుంది. పర్యాటక ప్రాంతమైన హడ్సన్ రివర్ చూడటానికి వచ్చిన హెలికాఫ్టర్ కంట్రోల్ తప్పి నదిలో పడింది.  రెస్య్కూ టీం ఆపరేషన్ చేసి ఆరుగురి మృతదేహాలను నది నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు. బాధితులు ఒక పైలట్, అతనితోపాటు స్పెయిన్‌కు చెందిన ఒక కుటుంబం. బాధితుల్లో ఇద్దరిని మొదట ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల కారణంగా వారు చికిత్స పొందుతూ మరణించారు.

ల్యాండింగ్ సమయంలో హెలికాఫ్టర్ క్రాష్ అయ్యింది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడం బెల్ 206 హెలికాప్టర్  టేకాఫ్ కాలేకపోయిందని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. మాన్‌హట్టన్ నుంచి న్యూయార్క్, న్యూజెర్సీ పోలీసులు అగ్నిమాపక శాఖ నౌకలతో పాటు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. హెలికాఫ్టర్ రోటర్ బ్లేడ్ విడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. హెలికాఫ్టర్ క్రాష్ అయ్యే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Advertisment
తాజా కథనాలు