Dog Saved Family: శభాష్‌రా చింటూ.. కుటుంబాన్ని కాపాడిన కుక్క ‘హీరో ఆఫ్‌ ది డే’

కుక్క విశ్వాసానికి ప్రతిరూపం అంటుంటారు. అందుకే పెంపుడు జంతువుగా ఎక్కువగా కుక్కల్నే పెంచుకుంటారు. పెరూ దేశంలో పెట్ డాగ్ ఓ జర్నలిస్ట్ కుటుంబాన్ని రక్షించింది. వారి పెంపుడు కుక్క డైనమైట్ దాడి నుంచి కాపాడి నిజమైన హీరోగా నిలిచింది.

New Update
Hero Dog In Peru

కుక్క విశ్వాసానికి ప్రతిరూపం అంటుంటారు. అందుకే పెంపుడు జంతువుగా ఎక్కువగా కుక్కల్నే పెంచుకుంటారు. పెరూ దేశంలో పెట్ డాగ్ ఓ జర్నలిస్ట్ కుటుంబాన్ని(dog saved family) రక్షించింది. వారి పెంపుడు కుక్క డైనమైట్ దాడి నుంచి కాపాడి నిజమైన హీరోగా నిలిచింది. పెరూలోని హువారల్ పట్టణంలో జర్నలిస్ట్ కార్లోస్ అల్బెర్టో మెసియాస్ జరతే ఇంట్లో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ దుండగుడు జర్నలిస్ట్ ఇంటి(Journalist Family) పై డైనమైట్ విసిరి పారిపోయాడు. ఈ పేలుడు పదార్థం కాలుతూ బ్లాస్ట్ అవ్వడానికి వచ్చింది. మాంచిస్ అనే పెట్ డాగ్ అది గమనించింది. ఆ డైనమైట్ దగ్గరకు పరుగెత్తుకెళ్లింది. కుక్క పళ్లతో ఆ డైనమైట్ ఫ్యూజ్‌ను పట్టుకుని నమిలి, మంటను ఆర్పేసింది.

Also Read :  కలకలం రేపుతున్న పోలీసుల మార్ఫింగ్ ఫొటోలు.. వీటి వెనుక ఆ రాజకీయ నేత హస్తం?

Dog Saved Journalist Family

Also Read :  గణేష్ నిమజ్జన ఊరేగింపులో భక్తులపై రాళ్ల దాడి

అలా చేసినందుకు దాని గొంతు బొంగురుపోయింది. అది అప్పటి నుంచి మొరగలేకపోతుంది. అయినా సరే ఈ ఫ్యామిలీని కాపాంది. దీంతో మాంచిస్ హీరో ఆఫ్ ది డే అని ప్రసంశలు అందుకుంటోంది. తర్వాత ఈ అటాక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులను భయపెట్టేందుకే ఇలా చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని డైనమైట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. మాంచిస్ చూపిన ధైర్యం, యజమాని పట్ల దానికున్న విశ్వాసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటనతో మాంచిస్‌ను నెటిజన్లు "నాలుగు కాళ్ల హీరో" అని పిలుస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు